Adivi Sesh Supriya : అడవి శేష్ ఎవరితో తిరిగితే మీకేంటి ? తనకు నచ్చిన పని చేస్తాడు చెప్పడానికి మీరెవరు ?
TeluguStop.com
చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఒక గాసిప్ నానుతూ ఉంది.దాన్ని గాసిప్ అనాలో లేదా కన్ఫర్మ్ చేసుకున్న న్యూస్ అనాలో తెలియదు కానీ అడవి శేష్( Ai Sesh ) గురించి మాత్రం ఒక వార్త వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆ వార్త ఏంటి అంటే అక్కినేని మనుమరాలు అయిన సుప్రియతో( Supriya ) అడవి శేష్ రిలేషన్ లో ఉన్నాడు అనేది ఆ వార్త సారాంశం.
అందులో నిజానిజాలు ఎవరికి తెలియదు కానీ వారిద్దరూ కలిసి రకుల్ ప్రీత్ పెళ్లి రోజు( Rakul Preet Wedding ) గోవా ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించడంతో మరోసారి అందరూ వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/02/facts-about-ai-sesh-relation-with-supriya-detailsa!--jpg" /
సదరు వీడియోలో అడవి శేష్ తన లగేజ్ తో ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ కనిపిస్తున్నాడు.
అలాగే ఆ వీడియోలో సుప్రియ కూడా అతని కోసం ఎదురు చూస్తూ కనిపించింది.
ఇద్దరు కలిసి గోవాకి( Goa ) వెకేషన్ కి వెళ్లి ఉంటారు.అయితే రిటర్న్ లో మాత్రం ఇలా మీడియా ముందు బుక్ అయిపోయారు.
కానీ సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే మాత్రం ఒక మాట చెప్పక తప్పదు.
అడవి శేష్, సుప్రియ ఇద్దరు మెజర్స్, వారికి నచ్చినట్టుగా వారి జీవితాన్ని మలుచుకునే అవకాశం వారికి ఉంది.
వారు ఎవరితో ఎలా రిలేషన్ లో ఉండాలి అనేది పూర్తిగా వారి వ్యక్తిగతం.
అంతమాత్రానికి వారిపై అవాకులు చెవాకులు మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/02/facts-about-ai-sesh-relation-with-supriya-detailsd!--jpg" /
పైగా అడవి శేష్ చాలా క్లారిటీతో ఉంటాడు.
తన జీవితంలోకి ఎవరిని ఆహ్వానించాలో లేదో అనే విషయం అతనికి బాగా తెలుసు.
సుప్రియ తో రిలేషన్ లో ఉన్నంత మాత్రాన అతని జీవితానికి ఒరిగేది ఏమీ లేదు.
పైగా అతను తీసే సినిమాలకు కెరియర్ కి సుప్రియ పెద్దగా ఉపయోగపడే అవకాశం కూడా లేదు.
మరి ఈ మాత్రం దానికి ఏదో కోట్ల కొద్ది ఆస్తి సుప్రియ తీసుకెళ్లి అడవి శేష్ ఒళ్ళో పోసినట్టు ఈ వార్తలు రాయడంలో అర్థం లేదు.
ఒకవేళ వారిద్దరూ పెళ్లి చేసుకున్న కూడా దానివల్ల ఎవరికి వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా.
గతంలో సుప్రియ కు వివాహం జరిగి ఒక కుమార్తె కూడా ఉంది.తన భర్త చరణ్ రెడ్డి( Charan Reddy ) చనిపోయాడు కూడా.
ఆమె మరో పెళ్లి చేసుకున్న అది మంచి విషయమే కదా.
ఇక పాత పాన్ కార్డులు పని చేయవా? కేంద్రం ఏం చెబుతోంది?