7G బృందావన్ కాలనీ ఫస్ట్ ఛాయిస్ రవికృష్ణ, సోనియా కాదట..?
TeluguStop.com
సెల్వరాఘవన్ దర్శకత్వంలో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించిన 7జీ బృందావన్ కాలనీ సినిమా ( 7G Brindavan Colony )సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్, సుమన్ సెట్టి, చంద్ర మోహన్, సుధ, సుదీప పింకీ, మనోరమ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.ఈ మూవీ యువతకు విపరీతంగా నచ్చేసింది.
రియలిస్టిక్‌గా ఉన్న ఈ సినిమా చాలామందికి కనెక్ట్ అయింది.ఇటీవల థియేటర్లలో రీరిలీజ్ అయి అప్పుడు కూడా భారీ రెస్పాన్స్ అందుకుంది.
"""/" /
ఈ సినిమా రిలీజ్ 20 ఏళ్లు అవుతున్న దీని గురించి ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.
ఇది అంతటి కల్ట్ స్టేటస్ సాధించింది మరి.ఈ మూవీలో హీరోగా చేసిన రవి కృష్ణ పక్కా బ్యాడ్ బాయ్ క్యారెక్టర్‌కి బాగా సూట్ అయ్యాడు.
హీరోయిన్ పాత్రకు సోనియా అగర్వాల్ ( Sonia Agarwal )పర్ఫెక్ట్ గా సూట్ అయింది.
అయితే ఈ సినిమాలో ముందుగా వీరిద్దరిని తీసుకోవాలని అనుకోలేదట.తాము ఇద్దరం కూడా ఈ మూవీకి ఫస్ట్ ఛాయిస్ కాదని వారే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"""/" /
తనను నటుడిగా చేయాలనే ఉద్దేశ్యం తన తండ్రి రత్నంకి లేదని, సూర్య, మాధవన్( Suriya )లు అందుబాటులో లేకపోవడం వల్లే తనను తీసుకున్నారు రవికృష్ణ స్వయంగా ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌తో వెల్లడించాడు.
"దర్శకుడు, నిర్మాతలు సూర్య లేదా మాధవన్‌ను హీరోగా నటింపజేయాలని అనుకున్నారు కానీ అది వర్కవుట్ కాలేదు.
"కాఖా కాఖా" సినిమా షూటింగ్‌లో సూర్య, "ప్రియమాన తోజి" సినిమాతో మాధవన్ బిజీగా ఉండటం వల్ల వాళ్లు ఈ మూవీకి సైన్ చేయలేకపోయారు.
అప్పుడు సెల్వరాఘవన్ న్యూ ఫేస్‌ను నటింపజేయాలని నిర్ణయించుకున్నారు.అలా నేను ఆ చిత్రంలో నటుడిని అయ్యాను.
" అని రవికృష్ణ పేర్కొన్నాడు.అయితే రవి కృష్ణ ఈ మూవీ స్టార్ట్ కావడానికి ముందు చాలా లావుగా ఉన్నాడట.
పిజ్జాలు, బర్గర్లు తిని ఫేస్ మొత్తం లావుగా అయ్యిందట.అప్పుడు సెల్వరాఘవన్ ఈ క్యారెక్టర్‌కి నప్పాలంటే ఖచ్చితంగా వెయిట్ తగ్గాల్సిందే అని చెప్పారట.
అప్పుడు రవి కృష్ణ నెలరోజులపాటు కష్టపడి వెయిట్ లాస్ అయ్యాడు.తర్వాత స్క్రీన్ టెస్ట్ చేసి ఓకే చేశారు.
ఇక సెల్వరాఘవన్ హీరోయిన్ రోల్‌కు మొదట జెనీలియా డిసౌజాని అనుకున్నారు.తరువాత ముంబై మోడల్ మమతా జవేరిని ఆడిషన్ చేసారు.
కానీ వారిద్దరూ వర్కౌట్ కాలేదు.తరువాత కలర్స్ స్వాతి రెడ్డి( Swathi Reddy )ని హీరోయిన్‌గా ఎంపిక చేసుకుని సినిమా మొదలుపెట్టారు.
చదువు లేదా ఇతర కారణాలవల్ల ఆమె ఈ సినిమాలో కంటిన్యూ కాలేకపోయింది.చివరికి ఆమెను తొలగించి సోనియా అగర్వాల్‌ను సెలెక్ట్ చేశారు.
సోనియా అప్పుడే ఒక సినిమా పూర్తి చేసేది ఇంటికి వెళ్ళిపోతుండగా సెల్వరాఘవన్ ఫోన్ చేసి హైదరాబాద్ కి వచ్చే 7G బృందావన కాలనీలో హీరోయిన్‌గా నటించాలని కోరారట.
ఆ అవకాశం తనకు రావడం తన అదృష్టమని ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ చెబుతుంది.
ఇండస్ట్రీలో అడుక్కున్నా కష్టమే… ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా: అర్జున్ అంబటి