ఫేస్‌బుక్ కీలక నిర్ణయం ... ఇక పై ఆ ఫీచర్లు కనపడవు ...!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ పేరు ఇటీవల 'మెటా' గా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

కానీ ఈ సంస్థ కంపెనీ పేరు మారినా దాని అనుబంధ సంస్థలైన ఫేస్‌బుక్ యాప్ ,ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్ పేర్లు మాత్రం మారలేదు.

ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరు మెటా (META) గా మారిన తర్వాత కొన్ని మార్పులకు సంస్థ శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగా ఫేస్‌బుక్ లో ఫేషియల్ రికగ్నిషన్ ను తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

"""/"/ గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్ వ్యక్తిగత గోప్యత పై తరచూ విమర్శలు వస్తున్నాయి.

పలు దేశాల్లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నది.అంతేకాకుండా ఇటీవల కంపెనీ మాజీ ఉద్యోగి ఫేస్‌బుక్ డాక్యుమెంట్లను లీక్ చేయడంతో ఫేస్‌బుక్ పలు ఇబ్బందులకు గురవుతోంది.

అయితే ప్రస్తుతం ఫేస్‌బుక్ వాడుతున్న ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని చాలాకాలంగా పలువురు వాదిస్తున్నారు.

దీనికి సంబంధించి నియంత్రణ సంస్థలు దీని వినియోగాన్ని నియంత్రించే నిబంధనలు రూపొందించే ప్రక్రియలో ఉన్నట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తెలిపింది.

ఈ నెలలోనే ఈ మార్పులు కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సంస్థ నుంచి సమాచారం.

అంతే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటి పై పెరుగుతున్న సామాజిక ఆందోళనకు వ్యతిరేకంగా బ్యాలెన్స్ చేసేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంట్ మాట్లాడుతూ ఫేస్ ప్రింటర్ల ను సైతం సంస్థ తొలగించనుందని, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ లో ఇదొక మార్పని, విస్తృత వినియోగం నుంచి పరిమితి విధించడానికే ఈ ఫీచర్ను తొలగిస్తున్నామని తెలిపారు.

2010లో ఫేస్‌బుక్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.అయితే ప్రస్తుతం ఫేస్‌బుక్ వాడుతున్న యూజర్లలో 37 మంది టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

"""/"/ అయితే ఫేస్ రికగ్నిషన్ ను తొలగించడం వల్ల వినియోగదారుల ఫేస్‌బుక్ లో వచ్చే మార్పులు ఏంటో చూద్దాం.

- ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను తొలగించడం వల్ల బిలియన్( Billion) కంటే ఎక్కువ మంది వినియోగదారులు ప్రభావితం కానున్నారు.

ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవారికి బాగా ఉపయోగపడే ఆటోమేటిక్ ఆల్ టెక్స్ట్ (ఏఏటీ) పై దీని ప్రభావం ఎక్కువగా పడనుంది.

- యూజర్ల ఖాతాలోని పర్సనల్ ఫోటో గుర్తింపు ఫీచర్ కూడా తొలగిపోతుంది.దీంతో ఇకపై ఫోటోలను వీడియోలను ఫేస్‌బుక్ దానంతట అదే గుర్తించదు.

ఫోటోలోని వ్యక్తులను సూచిస్తూ ట్యాగ్ చేయడం కూడా సాధ్యపడదు.అంతేకాకుండా ఫోటోలోని ఇతర వ్యక్తులను కూడా గుర్తించే అవకాశం ఉండదు.

ఏపీకి ప్రధాని మోది .. ఎన్నికల టూర్ ప్లాన్ ఇలా