బాంబు పేల్చిన ఫేస్ బుక్… ఇకపై మెసెంజర్ లో కేవలం 5 మందికే…!

ఫార్వాడ్ మెసేజ్ లను కట్టడి చేయడానికి సోషల్ మీడియా సంస్థలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

నిబంధనలను అతిక్రమించిన వారి ఖాతాలను నిషేధించడం జరుగుతుంది.వివాదాస్పద వ్యాఖ్యలు, మత వివక్షత, తదితర అంశాలపై ఇప్పటికే సోషల్ మీడియా ఉక్కుపాదం మోపుతోంది.

తాజాగా ఫేస్ బుక్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ను అందించింది.ఇప్పటినుంచి మెసెంజర్ లో కేవలం ఐదు మందికే మెసేజ్ ను ఫార్వాడ్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.

ఫార్వాడ్ మెసేజ్ ల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తి అధికంగా అవుతుందని ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటినుంచి ఎవరైనా ఎదైనా మెసేజ్ ను ఫార్వాడ్ చేయాలని అనుకుంటే ఒకే సారి కేవలం ఐదుగురికి మాత్రమే పంపవచ్చు.

ఒకవేళ పరిమితికి మించి మెసేజ్ ఫార్వాడ్ చేయాలని భావిస్తే మీకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ‘ఫార్వాడింగ్ లిమిట్ రిచ్డ్’ అంటూ డిస్ ప్లే అవుతుంది.

ప్రస్తుతం ఈ సదుపాయాన్ని కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం చేసింది ఫేస్ బుక్.

అంతర్జాతీయంగా సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ఫేస్ బుక్ వినియోగదారులందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

న్యూజిలాండ్ అమెరికాలో త్వరలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

"""/"/ సమాజానికి హాని తలపెట్టే నకిలీ, ప్రమాదకర, మత కల్లోల, వివాదాస్పద వార్తల వ్యాప్తిని నిలిపివేసేందుకు మెసేజ్ ఫార్వాడింగ్ పై పరిమితి విధించడం ఎంతో ముఖ్యమైందని ఫేస్ బుక్ స్పష్టం చేసింది.

దీంతో పాటుగా ప్రస్తుతం ప్రపంచంలో వ్యాప్తి చెందుతున్న కరోనాపై పలు తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, వాటిని కూడా నియంత్రించవచ్చన్నారు.

దీనిపై ఫేస్ బుక్ అంతర్గత పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంది.కాబట్టి ఏవైనా మెసేజ్ లు పంపేముందు ఒకటికి రెండు సార్లు అవి కరెక్టో కాదో చెక్ చేసుకోండి.

భార్య, పిల్లలను చంపేందుకు ఎన్నారై డాక్టర్ ప్రయత్నం.. కట్ చేస్తే..??