ఫేస్‌బుక్‌లోని ఈ ట్రెండింగ్ ఫీచర్ తెలుసా?
TeluguStop.com

ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.ప్రస్తుతం పాపులర్ అవుతోన్న క్లబ్ హౌస్ మాదిరి ఇది కూడా లైవ్ ఆడియోను రూమ్స్‌ను రూపొందించనుంది.


ఇప్పటికే రాపర్ డీ స్మోక్, మానవ హక్కుల ఉద్యమకర్త డీరే మెక్సన్ కూడా ఈ ప్లాట్‌ఫాంలోకి ఎంటర్ అయ్యారు.


ఇక మరింత మందిని ఆహ్వానించడానికి ఫేస్‌బుక్ కసరత్తు చేస్తోంది.కానీ, నిశీతంగా పరీక్షించిన ఖాతాదారులను మాత్ర మే అనుమతిస్తోంది.
దీనికి చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఫేస్‌బుక్.గత సంవత్సరమే క్లబ్ హౌస్‌కు దాదాపు 10 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది.
ఇక ట్విట్టర్ కూడా స్పేసెస్ అని ఈ తరహా ఫీచర్‌నే లాంbŒ∙చేసిన సంగతి తెలిసిందే! ఇప్పటికే బీటా యూజర్లు స్పాటిఫై గ్రీన్‌రూం ఫీచర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఫేస్‌బుక్ లైవ్ ఆడియో రూమ్స్ త్వరలోనే మన దేశానికి కూడా పరిచయం చేయనుంది.
సోషల్ మీడియాలో ఆడియో బేస్డ్ సోషల్ నెట్‌వర్క్‌ల విస్త్రతి పెరిగింది. """/"/ ఇంకా రానున్న రోజుల్లో మరిన్నీ అందుబాటులోకి రావచ్చు.
ఇప్పటికే లైవ్ ఆడియో రూమ్స్ పేరిట అమెరికాలో ఇప్పటికే విడుదల చేసింది ఫేస్ బుక్.
ఇక క్లబ్ హౌస్ మాదిరి ఫేస్‌బుక్‌లో కూడా ఉండనున్నాయి.రూంలో మాట్లాడనుకుంటే స్పీకర్లను ప్రమోట్ చేసుకోవాలి.
టాపిక్ ఆధారంగా సెర్చ్ చేయాలి.అమెరికాలో ఫేస్ బుక్ లైవ్ ఆడియో రూం ప్రచారం కోసం ఇప్పటికే చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్‌లను ముందుకు తీసుకువస్తుంది.
ఇప్పటికే స్పాటిఫై, ట్విట్టర్, క్లబ్ హౌస్, ఇప్పుడు ఫేస్ బుక్ ఈ పోటీలో దూసుకుపోయేది ఎవరో రానున్న రోజుల్లో తెలుస్తుంది.
ఇప్పటికే క్లబ్ హౌస్ దరిదాపుల్లో కూడా ఏదీ లేదు.అంతగా ముందుకు దూసుకుపోతోంది.
ఫేస్ బుక్ మరో సరికొత్త ఫీచర్‌తో ఇక రానున్న రోజుల్లో దీని వినియోగదారులు కూడా పెరగనున్నాయి.
ఇక మరింత మంది యూజర్లను తమ సొంతం చేసుకోనుంది.