చ‌ర్మ రంగును పెంచుకోవాలా.. అయితే ఈ ఎఫెక్టివ్ టిప్స్ మీకోసమే!

సాధార‌ణంగా తాము రంగు త‌క్కువ‌గా ఉన్నామ‌ని కొంద‌రు ఫీల్ అవుతుంటారు.ఈ క్ర‌మంలోనే చ‌ర్మ రంగును పెంచుకునేందుకు ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు.

మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ర‌కాల క్రీముల‌ను వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి కొనుగోలు చేసి.

యూస్ చేస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ఫ‌లితం క‌నిపించ‌కుంటే.

బాధ ప‌డుతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను ఫాలో అయితే.

న్యాచుర‌ల్‌గా చ‌ర్మ రంగును పెంచుకోవ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ముల్తానీ మట్టి చ‌ర్మ రంగును పెంచ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో ముల్తానీ మ‌ట్టి, పెరుగు మ‌రియు రోజ్ వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.అర గంట పాటు ఆరిపోనివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.

చ‌ర్మ ఛాయ క్ర‌మంగా పెరుగుతుంది.‌ """/" / అలాగే అర‌టి పండు కూడా చ‌ర్మ రంగును పెంచుతుంది.

ఒక బౌల్‌లో బాగా పండిన అర‌టి పండు పేస్ట్ మ‌రియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల.

చ‌ర్మ రంగు పెరుగుతుంది.మ‌రియు ముఖం మృదువుగా కూడా మారుతుంది.

ఇక బంగాళాదుంప కూడా చ‌ర్మ ఛాయ‌ను పెంచ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ఒక బంగాళ‌దుంప తీసుకుని మొత్త‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

ఆ ర‌సంలో కొద్దిగా తేని వేసి మిక్స్ చేసి ముఖానికి ప‌ట్టించాలి.ప‌దిహేను నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల కూడా చ‌ర్మం రంగు పెరుగ‌తుంది.