చర్మం జిడ్డు లేకుండా మిలమిల మెరవాలంటే... డ్రై ఫ్రూట్ ప్యాక్స్

అందమైన, మచ్చలు లేని ముఖం కావాలని అందరూ ఆశ పడతారు.అయితే దాన్ని సాధించటం చాలా కష్టమని అందరూ భావిస్తారు.

అయితే ఇంట్లో సులువుగా అందుబాటులో ఉండే వస్తువులతో చాలా సులభంగా అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.క్యారెట్ ముక్క, బీట్ రూట్ ముక్క,ఒక టమోటా,ఒక స్పూన్ బాదం పొడిని పేస్ట్ చేయాలి.

ఈ పేస్ట్ లో పెరుగు కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

నాలుగు జీడిపప్పులను మెత్తని పొడిగా చేసుకొని దానిలో పచ్చి పాలను కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

"""/" / ఒక స్పూన్ జీడిపప్పు పొడిలో ఒక స్పూన్ ఆవాల నూనె, రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి.ఈ విధంగా చేయటం వలన ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం కాంతివంతంగా మారుతుంది.

నాలుగు బాదం పప్పులు,పచ్చి పాలు, రోజ్ వాటర్ వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీలో వేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తు ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

అమితాబ్ సంస్కారానికి ఫిదా అవ్వాల్సిందే.. దివ్యాంగురాలి విషయంలో అలా ప్రవర్తించారా?