ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేయలేడు.. ట్రంప్‌పై విరుచుకుపడ్డ బైడెన్

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి నెలలు గడవకుముందే అప్పుడే 2024 ఎన్నికలపై అక్కడ విశ్లేషణలు మొదలయ్యాయి.

డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల నేతలు సైతం అప్పుడే వ్యూహాలు రచిస్తున్నారు.ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ విరుచుకుపడ్డారు.

కాప్ 26 సదస్సులో పాల్గొనడానికి ముందు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బైడెన్.ట్రంప్‌పై విమర్శలు చేశారు.

2024లోనే కాదు భవిష్యత్‌లో కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేరని బైడెన్ జోస్యం చెప్పారు.

వర్జీనియనా రాష్ట్ర గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న డెమొక్రాట్ నేత టెర్రీ మెక్‌అలిఫ్‌కు మద్ధతుగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బైడెన్.

తన ప్రసంగంలో కనీసం 27 సార్లు ట్రంప్ పేరును ఉచ్చరించారు.ఇదే సమయంలో టెర్రీ.

ప్రత్యర్ధి, రిపబ్లికన్ నేత యంగ్‌కిన్ పేరును మాత్రం రెండుసార్లు మాత్రమే ఆయన పలికారు.

అది కూడా అతని గురించి వార్తా కథనాన్ని చదువుతున్నప్పుడు మాత్రమే బైడెన్.యంగ్‌కిన్‌పై విమర్శలు చేశారు.

తాను డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ చేశానని.టెర్రీ , ట్రంప్ సహచరుడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని బైడెన్ వ్యాఖ్యానించారు.

యంగ్‌కిన్ మాట్లాడటానికి ఇష్టపడడని.కానీ రిపబ్లికన్ నామినేషన్‌ను గెలవడానికి అతను ట్రంప్‌ను ఆలింగనం చేసుకున్నాడని బైడెన్ దుయ్యబట్టారు.

"""/"/ 2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ 10 పాయింట్ల తేడాతో వర్జీనియాను కైవసం చేసుకున్నాడు.

చివరిసారిగా 2009లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఇక్కడ గెలిచారు.మోన్‌మౌత్ యూనివర్సిటీ గత వారం విడుదల చేసిన ఒక సర్వేలో డెమొక్రాట్ల ఆధిపత్యం తగ్గుతున్నట్లు చెప్పడంతో మెక్‌ఆలిఫ్- యంగ్‌కిన్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం వుందని నిపుణులు భావిస్తున్నారు.

అధ్యక్షుడిగా తప్పుకున్నాక కూడా ప్రజాదరణ ఏమాత్రం తగ్గని బరాక్ ఒబామా .వర్జీనియాలోని నల్లజాతీయుల ఓటర్లను రాబడతారని డెమొక్రాట్ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు.

వచ్చే ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉత్తర వర్జీనియాలోని వాషింగ్టన్ శివారు ప్రాంతాలు డెమొక్రాట్లకు బలమైన కోటగా వున్నాయి.అయితే సాంప్రదాయక దక్షిణ, నైరుతి వర్జీనియాలు, రిచ్‌మండ్ ప్రాంతం ఎటువైపు మొగ్గుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

వర్జీనియా ఒకప్పుడు రిపబ్లికన్లకు బలమైన కోటగా వుండేది.అయితే ఇటీవలి సంవత్సరాలలో వైవిధ్యభరితమైన ఓటర్ల కారణంగా డెమొక్రాట్లు పటిష్టంగా వున్నారు.

వీరిలో భారత సంతతి ఓటర్లే ఎక్కువ.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!