ప్రతిష్టాత్మక అవార్డు రేసులో భారతీయ అమెరికన్ మహిళ పారిశ్రామికవేత్త

అమెరికాలో భారతీయులు పలు రంగాల్లో దూసుకెళ్తూ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన ఎంఎంఎస్ హోల్డింగ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉమా శర్మ ఓ అవార్డు బరిలో నిలిచారు.

మిచిగాన్ , నార్త్ వెస్ట్ ఓహియోకి సంబంధించి 2020 ఏడాదికి గాను ఎంటర్‌ప్రెన్యూయర్‌ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫైనలిస్ట్‌ల జాబితాలో ఆమె ఎంపికయ్యారు.

ఉమా సారథ్యంలోని ఎంఎంస్ హోల్డింగ్స్‌కు గతంలో ఎన్నో అవార్డులు దక్కాయి.డేటా, టెక్నాలజీస్‌లపై ఫోకస్ చేసిన ఈ సంస్థ ప్రధానంగా బయోటెక్ మరియు వైద్య రంగ పరిశ్రమలకు మద్ధతు ఇస్తుంది.

ఇటీవల టీకా అభివృద్ధిలో డేటా సంబంధిత సేవలకు గాను ఈ సంస్థకు యునైటెడ్ స్టేట్స్ తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున 10,00,000 డాలర్ల గ్రాంట్ లభించింది.

దాదాపు 34 సంవత్సరాలుగా ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్‌పీ సంస్థ పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇస్తూ వస్తోంది.

ఈ అవార్డుకు సంబంధించి 29 మందితో స్వతంత్రుల కమిటీ రూపొందించిన తుది జాబితాలో ఉమా శర్మను ఎంపిక చేసింది.

"""/"/ అక్టోబర్ 8, గురువారం ఒక ప్రత్యేక వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ అవార్డు విజేతలను ప్రకటిస్తారు.

కరోనా సంక్షోభ సమయంలో తమ ఉద్యోగులకు అసాధారణమైన సహాయన్ని అందించిన వ్యవస్థాపకులను సాహసవంతులుగా ఎర్నెస్ట్ యంగ్ ప్రశంసించింది.

ప్రతికూలతను అధిగమించడంతో పాటు ఆరు ప్రమాణాల ఆధారంగా నామినీలను అంచనా వేస్తారు.ప్రపంచంలోని 60కి పైగా దేశాలలో 145కి పైగా నగరాల్లో వ్యాపార నాయకులను గుర్తించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎర్నెస్ట్ అండ్ యంగ్ వెల్లడించింది.

కాగా 14 ఏళ్ల క్రితం ఎంఎంఎస్ ప్రారంభించామని, నాటి నుంచి నేటి వరకు సంస్థ ప్రయాణంలో ఎన్నో ఉత్థానపతనాలను చూశామని ఉమా శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రాంతీయ అవార్డు గ్రహీతలు.నవంబర్‌లో ప్రకటించబోయే ఎంటర్‌ప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్ జాతీయ అవార్డుల పరిశీలనకు అర్హులు.

అలాగే ఎంటర్‌ప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్ నేషనల్ ఓవరాల్ అవార్డు గ్రహీత జూన్ 2021లో ఈవై వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు పోటీ పడతారు.

ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్‌పీ స్థాపించిన నాటి నుంచి ఎంటర్‌ప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఎస్ఏపీ అమెరికా, కౌఫ్‌మన్ ఫౌండేషన్లు స్పాన్సర్ చేస్తూ వస్తున్నాయి.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..?