బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ట్రిపుల్ ఐటీని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు.

ఇటీవల మృతిచెందిన ఇద్దర విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.దీంతో ట్రిపుల్ ఐటీ వద్ద పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.

మరోవైపు క్యాంపస్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.