జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో తీవ్ర ఉద్రిక్తత
TeluguStop.com
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.జగ్గాసాగర్, రామలచ్చక్క పేట గ్రామాల మధ్య చెలరేగిన సరిహద్దు వివాదం ఘర్షణకు దారితీసింది.
జగ్గాసాగర్ గ్రామంలోని వరద కాలువపై రామలచ్చక్కపేట గ్రామస్థులు మొక్కలు నాటడంతో గొడవ ప్రారంభమైంది.
ఈ క్రమంలో మొక్కలు నాటి తమ భూమిని లాక్కుంటున్నారని జగ్గాసాగర్ వాసులు ఆందోళన దిగారు.
ఈ క్రమంలో సరిహద్దు వద్దకు రెండు గ్రామాల ప్రజలు భారీగా చేరుకోవడంతో హై టెన్షన్ నెలకొంది.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు గ్రామాల వాసులకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఆ విషయాలు చెబితే కాపురాలు కూలిపోతాయి… బిగ్ బాస్ హిమజ సంచలన వ్యాఖ్యలు?