కాకినాడ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..!
TeluguStop.com
కాకినాడ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.తొండంగిలోని సెజ్ పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు టీడీపీ నేతలు.
ఇందులో భాగంగా కార్యక్రమానికి వెళ్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
శాంతి భద్రతల నేపథ్యంలో వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు.దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించారు.