సుధీర్ ను మామయ్య అని పిలిచిన రష్మీ.. అసలేం జరిగిందంటే..?
TeluguStop.com
బుల్లితెరపై కొన్ని జోడీలకు సంవత్సరాలు గడిచినా క్రేజ్, ఫాలోయింగ్, పాపులారిటీ ఏ మాత్రం తగ్గవు.
అలాంటి జోడీలలో ఒకటైన సుధీర్ రష్మీ జోడీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా రష్మీ సుధీర్ ను మామయ్య అని పిలుస్తూ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందించారు.
సుధీర్ ఈ వారం ప్రోమోలో చిన్నపిల్లలతో కలిసి షోలోకి ఎంట్రీ ఇచ్చారు.యాక్టర్ అంటే ముఖంలో నవరసాలు పలకాలని సుధీర్ చెప్పగా అవతలి వైపు ఉన్న అమ్మాయి మరి నువ్వెలా అయ్యావ్ అంటూ రివర్స్ లో అడుగుతారు.
పిల్లల్ని ఏదీ ఒకసారి మామయ్య అనండమ్మా అని సుధీర్ అడగగా అందరూ మామయ్య అని పిలుస్తారు.
రష్మీ గౌతమ్ కూడా సుధీర్ ను మామయ్యా మామయ్యా అని పిలవడంతో సుధీర్ రెండు చేతులెత్తి దండం పెడతాడు.
ఆ తర్వాత వర్ష ఎంట్రీ ఇచ్చి బుల్లెట్ భాస్కర్ తో తనకు ఆకలేస్తుందని చికెన్ కావాలని అడుగుతారు.
"""/"/
అటుసైడ్ వెళితే ఊరపందులు ఉంటాయని వాటిని గుద్దెయ్యాలని బుల్లెట్ భాస్కర్ చెప్పగా నిన్ను గుద్దితే నీకేం ప్రాబ్లమ్ లేదా అంటూ వర్ష పంచ్ వేస్తారు.
విటమిన్ డీ అంబ్రిల్లా, మ్యాజిక్ అంబ్రిల్లా అంటూ పంచ్ లు వేస్తూ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ప్రోమోలో వేసిన పంచ్ లు వేసి నవ్వించారు.
ఆ తర్వాత అల్లరి సుభాషిణి షోలోకి ఎంట్రీ ఇచ్చి అదిరిపొయే స్టెప్పులు వేశారు.
తాను మళ్లీ చచ్చిపోయి బ్రతకానని సుభాషిణి అన్నారు.తనకు క్యాన్సర్ వచ్చిందని క్యాన్సర్ తో బాధ పడ్డానని ఆమె వెల్లడించారు.
సుభాషిణి అలా చెప్పడంతో షోలో అంతా ఎమోషనల్ అయ్యారు.ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా కనిపించని సుభాషిణి జబర్దస్త్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం గమనార్హం.
డ్యాన్స్ లో టాలీవుడ్ నంబర్ హీరో అతనేనా.. చరణ్, బన్నీ, తారక్ లలో ఎవరంటే?