మొన్న కాల్పులు, నేడు దోపిడి బెదిరింపులు .. కెనడాలోని హిందూ కమ్యూనిటీలో భయాందోళనలు

కెనడాలోని( Canada ) సర్రేలో వున్న హిందూ సంఘం నాయకులు లోయర్ మెయిన్‌ల్యాండ్‌లో( Lower Mainland ) ‘‘ప్రస్తుత శాంతిభద్రతల పరిస్ధితి’’పై శనివారం పబ్లిక్ ఫోరమ్‌ని నిర్వహిస్తున్నట్లు గ్లోబల్ న్యూస్ నివేదించింది.

స్థానిక వ్యాపారులను బెదిరిస్తున్న దోపిడీ రాకెట్ గురించి రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) హెచ్చరికల నేపథ్యంలో బ్రిటీష్ కొలంబియాలోని వైదిక్ హిందూ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

గత నెల 27న సొసైటీ అధ్యక్షుడు సతీష్ కుమారుడి ఇంటిని లక్ష్యంగా జరిగిన కాల్పుల ఘటన తర్వాత ఈ కార్యక్రమం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ఘటనలో సతీష్ కుమారుడికి ఎలాంటి గాయాలు కానప్పటికీ, న్యూటన్ ప్రాంతంలోని అతని భవనానికి బుల్లెట్ హోల్స్ పడ్డాయి.

ఈ ఘటనకు సంబంధించి ఫోన్ కాల్స్ , ఉత్తరాలు వచ్చాయని గ్లోబల్ న్యూస్ నివేదిక తెలిపింది.

డిసెంబర్‌లో తన కుమారుడి ఇంటిపై కాల్పులు జరిపారని , తనకు తన కుటుంబానికి ఎలాంటి బెదిరింపు కాల్స్ రానప్పటికీ పెరుగుతున్న హింస ఆందోళన కలిగిస్తోందన్నారు.

మెట్రో వాంకోవర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మాట్లాడుతూ ఈ ఘటన తనను కలిచివేసిందని, ఆయన సర్రేలోని ఫోరమ్‌కు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

తన తల్లిదండ్రులు, పిల్లలు చాలా భయపడుతున్నారని .తనను ఇల్లు విడిచి బయటకు పంపడం లేదని చెప్పారు.

సర్రేలోని ఆర్‌సీఎంపీ ఇటీవల ప్రకటించిన అరెస్ట్‌లు తమ కమ్యూనిటీకి పెద్దగా ఓదార్పునివ్వలేదన్నారు.నవంబర్‌లో అబాట్స్‌ఫోర్డ్ , ఆర్‌సీఎంపీలోని( Abbotsford, RCMP ) పోలీసులు ఆ సమయంలో వెలుగులోకి వచ్చిన బెదిరింపు లేఖల గురించి హెచ్చరించారు.

అది భారతీయ ముఠా నుంచి వచ్చిందని దుండగులు 2 మిలియన్ డాలర్లు డిమాండ్ చేశారని పోలీసులు చెప్పారు.

"""/" / కాగా.ఖలిస్తాన్ ఉగ్రవాది , ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ( Murder Of Hardeep Singh Nijjar )వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల తర్వాత ఖలిస్తాన్ గ్రూపులు , మద్ధతుదారులు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ‘‘సిక్స్ ఫర్ జస్టిస్ ’’ (ఎస్ఎఫ్‌జే) తీవ్రంగా రియాక్ట్ అవుతోంది.

హిందువులంతా తక్షణం కెనడాను వదిలిపెట్టాల్సిందిగా పన్నూ సారథ్యంలోని ఎస్ఎఫ్‌జే హెచ్చరించింది.నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి మద్ధతుగా హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాల్సిందిగా అల్టీమేటం జారీ చేసింది.

"""/" / ఇక్కడున్న హిందువులు భారతదేశానికి మద్ధతు ఇవ్వడమే కాకుండా.ఖలిస్తాన్ ( Khalistan )మద్ధతుదారుల ప్రసంగాలు, వ్యక్తీకరణను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఎఫ్‌జే ఆరోపించింది.

ఎస్ఎఫ్‌జే వీడియోనే కాకుండా.కెనడాలోని భారత్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్తలకు బెదిరింపులు.

వారి పోస్టర్‌లు, గ్రాఫిటీలతో దేవాలయాలను అపవిత్రం చేసిన ఘటనలు గత వేసవి నుంచి భారీగా పెరిగాయి.

ఈ చర్యలు కెనడాలో హిందూ ఫోబియా సమస్య తెరపైకి రావడదానికి దారి తీశాయి.