భారతీయ విద్యార్ధుల వీసాల సంగతి చూడండి : న్యూజిలాండ్‌ సర్కార్‌తో కేంద్ర మంత్రి జైశంకర్

న్యూజిలాండ్ పర్యటనలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ బిజీబిజీగా గడుపుతున్నారు.

దీనిలో భాగంగా గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రి ననైయా మహుతాతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఇండో పసిఫిక్, ఉక్రెయిన్ సంక్షోభం తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.

అలాగే ఐక్యరాజ్యసమతి, కామన్‌వెల్త్ ఫోరమ్‌లలో ఇరుదేశాలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు.ఇదే సమయంలో భారతీయ విద్యార్ధుల వీసాల మంజూరు జాప్యంపై జైశంకర్ ప్రస్తావించారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో భారతీయ విద్యార్ధులు స్వదేశానికి వచ్చేశారని.తర్వాత వారు తిరిగి న్యూజిలాండ్ చేరుకునేందుకు వీసాలను పునరుద్ధరించలేదని కివీస్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు జైశంకర్.

విద్యార్ధులకు వీలైనంత త్వరగా వీసాలను మంజూరు చేసి చదువులు కొనసాగించేందుకు వీలు కల్పించాలని ఆయన కోరారు.

న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తోన్న విదేశీ విద్యార్ధుల్లో భారతీయులు రెండవ స్థానంలో వున్నారు.

ఐటీ, హాస్పిటాలిటీ, సైన్స్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్కర్ వంటి వివిధ విభాగాలలో భారతీయ విద్యార్ధులు చదువుకుంటున్నారు.

ఇకపోతే.గురువారం అక్లాండ్‌లో న్యూజిలాండ్ వ్యాపారవేత్తలతో జైశంకర్ భేటీ అయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.ఉక్రెయిన్ వివాదం ఇంకా వేడిగా వుందన్నారు.

జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ భద్రతకు సంబంధించి రష్యన్‌లపై ఒత్తిడి తీసుకురావాలని పలుదేశాలు భారత్‌ను అభ్యర్ధించినట్లు జైశంకర్ గుర్తుచేశారు.

"""/"/ న్యూజిలాండ్ పర్యటనను ముగించుకున్న తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్తారు జైశంకర్.అక్కడ కాన్‌బెర్రా, సిడ్నీ నగరాలను సందర్శిస్తారు.

ఈ ఏడాది ఆస్ట్రేలియాను సందర్శించడం ఆయనకు ఇది రెండవ సారి.ఫిబ్రవరిలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిమిత్తం జైశంకర్ ఆస్ట్రేలియా వచ్చారు.

తాజా పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలిసి విదేశాంగ మంత్రుల ఫ్రేమ్‌వర్క్ డైలాగ్‌ను నిర్వహిస్తారు.

అలాగే ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్‌తోనూ ఆయన భేటీ కానున్నారు.

సిడ్నీలోని లోవీ ఇన్‌స్టిట్యూట్‌ను సంప్రదించడంతో పాటు ఆస్ట్రేలియన్ నేవీ, మీడియా, థింక్ ట్యాంక్‌లతో కూడా జైశంకర్ పరస్పర చర్చలు జరుపుతారు.

క్యాన్సర్ పై పోరాడుతున్న నాపై అలాంటి కామెంట్లు.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!