బాగ్ లింగంపల్లి లోని అర్ టి సి కళ్యాణ మండపం లో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల పై హైదరాబాద్ పోలీసుల విసృత ప్రచారం.

మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలు, నియంత్రణ పై విద్యార్థులలో, యువత కు అవగాహన.

ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీసు కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ సెంట్రల్ జోన్ ఇంచార్జి డీసీపీ రాజేష్ చంద్రన్ ఏ సిపి శ్రీధర్, సి ఐ సంజయ్ & పోలీస్ సిబ్బంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాటశాల కళాశాల విద్యార్థులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్.

సి వి ఆనంద్ డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.ఓచ్చే 10 సంవత్సరాల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఒకటి ఎంప్లాయ్ మెంట్ రెండు మాదక ద్రవ్యాలు.పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతాల లో కూడా మాదక ద్రవ్యాలు గంజాయి లభిస్తున్నాయి.అటవీ ప్రాంతల నుండి వీటిని రవాణా చేస్తున్నారు కోవిడ్ టైమ్ లో కొంత మంది విద్యార్థులు గంజాయి కి అలవాటు పడ్డారు.

కొంత మంది అమ్మాయిలు కూడా అలవాటు పడుతున్నారు.ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద బయట కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్నారు.

ముఖ్యమంత్రి కె సి అర్ స్వయానా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వెయ్యి మంది పోలీసులతో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ & నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మాదక ద్రవ్యాలు అమ్మిన కొన్న కటిన చర్యలు తప్పవు.ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వారిని అరెస్ట్ చేసి జైలు కు పంపుతాం అట్టి వారిని రిహల్బ్టేషన్ పంపించి సమాజంలో ఓ వ్యక్తిగా తీర్చిదిద్దుతా భవిషత్ కుటుంబాల్లో ఎవరు కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా కటిన చర్యలు తీసుకుంటున్నాము అందరి భాగస్వామ్యంతో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రజల్లో చైతన్యం నింపేలా ప్రచారం చేపడుతం.

ఓజీ సినిమాతో అకీరా నందన్ ఎంట్రీ ఇస్తున్నారా.. రామ్ చరణ్ జవాబు ఇదే!