ప్రపంచంలో 60 శాతం మందికి కరోనా ప్రమాదం

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న అతి పెద్ద బయో వెపన్.దీనిని ఎవరు, ఎందుకు, ఎక్కడ, ఎలా పుట్టించారో తెలియదు కాని మనిషి మూర్ఖత్వం వలన అయితే పుట్టిందని మాత్రం తెలుస్తుంది.

ఏదో ఒక దేశాన్ని నాశనం చేయాలనే ఆలోచనలతో చైనా, జపాన్ లాంటి దేశాలు ఇలాంటి బయో వెపన్స్ గా పనిచేసే కొత్త కొత్త వైరస్ లని తయారు చేస్తున్నారు.

చైనా ఇలాంటి విపరీత గతంలో పాల్పడిన ఘటనలు ఉన్నాయి.అయితే ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అనే దానికి ఇప్పుడు కరోనా వైరస్ తో చైనా పడుతున్న అవస్థలు చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.

చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఇప్పటికి 1000 మంది మృత్యువాతపడ్డారు.

43 వేల మందికి ఈ వైరస్ సోకింది.దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అనేది.

అందుకే ఇప్పుడు కరోనా వైరస్ కి ప్రపంచ దేశాలు అన్ని భయపడుతున్నాయి.దీనిని అడ్డుకోవడానికి ఇప్పటికే ప్రయోగాలు కూడా మొదలు పెట్టాయి.

అయితే ఇప్పుడు దీనికి సంబంధించి హాంకాంగ్ కి చెందిన మేడిక ఆఫీసర్ గ్రబ్రియాల్ లియంగ్ ప్రపంచానికి ఓ హెచ్చరిక పంపించారు.

ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోకుంటే ప్రపంచంలో దాదాపు 60 శాతానికి పైగా జనాభా ఈ వైరస్ బారిన పడి చనిపోతారని లియంగ్ సంచలన విషయాలు వెల్లడించారు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రపంచ దేశాలని భయ పెట్టాయి.కరోనా వ్యాప్తిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అరికట్టాలని - దాంతోపాటు వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయాలని లియంగ్ హెచ్చరించారు.

కరోనా వైరస్ సోకిన ప్రతి రోగి ద్వారా మరో రెండున్నర శాతం మందికి ఈ వ్యాధి సోకుతోందని లియంగ్ చెప్పారు.

దాన్ని బట్టి ఇది వేగంగా విస్తరిస్తుందనే విషయం అర్ధమవుతుందని అన్నారు.ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన మానవ మనుగడకి ఇదే అతి పెద్ద విపత్తుగా మారబోతుందని కూడా చెప్పాడు.

మరి ఆయన మాటలని ప్రపంచ దేశాలు ఎంత వరకు వింటాయి అనేది వేచి చూడాలి.

వైరల్: చనిపోయిన కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తండ్రి.. కొడుకే చంపాడంటూ..