శ్రీవారికి కానుకలుగా ఖరీదైన వాచీలు.. వాటికి త్వరలో వేలం..!

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

వీరిలో చాలావరకు ప్రజలు తమకు చేతనైనంత కానుకలను అందజేస్తుంటారు.కొందరు బంగారు బిస్కెట్లు, కోట్లాది రూపాయలను దానం ఇస్తే మరి కొందరు తమ శక్తికొద్దీ 100, 200 రూపాయలు హుండీలో వేస్తుంటారు.

తమకు ఇష్టమైన వస్తువులను కూడా కానుకగా ఇచ్చి దేవుడి పట్ల తమ భక్తిని చాటుకుంటారు.

అయితే ఇలా దేవుడి హుండీలో వేసిన ఖరీదైన వాచీలను వేలం వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు హుండీలో కానుకగా సమర్పించిన వాచీలను వేలం వేయడానికి సిద్ధమైంది.

అయితే ఇలా వేలం వేసిన వాచీలను కొనుగోలు చేసేందుకు చాలా మంది భక్తులు సిద్ధంగా ఉన్నారు.

ఎందుకంటే హుండీలో ఉన్న కానుకలు తీసుకుంటే స్వామి వారి ఆశీస్సులు పొందొచ్చని ప్రజలు భావిస్తారు.

అలాంటి వారి కోసం ఆగస్ట్ 18న వేలం వేసేందుకు టీటీడీ కసరత్తులు చేస్తోంది.

"""/" / ఈ నెల 18న వాచీల వేలాన్ని ఆన్‌లైన్‌లోనే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, ఇతర అనుబంధ ఆలయాల హుండీల్లో భక్తులు ఇచ్చిన వాచీలను ఈ-వేలంలో విక్రయిస్తారు.

టీటీడీ ప్రకారం, ఈ-వేలంలో సీకో, హెచ్ఎమ్‌టీ, టైటాన్, సోనీ, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, సిటిజన్, రొలెక్స్‌తోపాటు ఇతర కంపెనీల వాచీలు ఉంటాయి.

వీటిలో కొత్త వాటికి ఒక వేలం రేటు, పాత వాటికి మరొక వేలం రేటును నిర్ణయిస్తారు.

వేలం పాట పాడాలనుకునేవారు మరిన్ని వివరాలకు 0877-2264429 నంబర్‌కి ఫోన్ కాల్ చేయవచ్చు.

టీటీడీ వెబ్‌సైట్‌ !--wwwtirumala!--org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ !--wwwkonugolu.ap.

Gov!--in ద్వారా ఈ వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.

Akkineni Nageswara Rao : అన్నపూర్ణ పిక్చర్స్ అక్కినేని సొంతం కాదా.. అసలు నిజం తెలిస్తే..