ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ వేగవంతం
TeluguStop.com
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నోయిడాలో సీమెన్స్ కంపెనీ డైరెక్టర్ భాస్కర్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో భాస్కర్ కు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.
మరోవైపు భాస్కర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో రూ.
242 కోట్ల కుంభకోణం జరిగినట్లు సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.అదేవిధంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రమేయం ఉందని ఏపీ సీఐడీ గుర్తించింది.
గత ప్రభుత్వ హయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చిన విషయం తెలిసిందే.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు .. ఆ నలుగురు భారతీయులకు బిగ్ రిలీఫ్