బీఆర్ఎస్ కు జై కొట్టారా ? ఎంపీ స్థానాలపై అంచనాలు పెరిగాయా ?
TeluguStop.com
తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్( BRS ) మూడోసారి మాత్రం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, బిఆర్ఎస్ పని ఇక ముగిసిన అధ్యయనం అని, ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదని అంతా ఒక అంచనాకు వచ్చేసారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 17 స్థానాల్లోనూ పోటీ చేసింది.అయితే కాంగ్రెస్( Congress ) కే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వస్తాయని, రెండవ స్థానంలో బిజెపి ఉండగా, మూడో స్థానానికి బీఆర్ఎస్ పరిమితం అవుతుందని విశ్లేషణలు చాలానే వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో, ఆ పార్టీ వైపే జనాలు మొగ్గు చూపుతారని, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే ఛాన్స్ న్స్ ఉందనే సంకేతాలతో బిజెపి కి బాగానే సీట్లు దక్కుతాయని, బీఆర్ఎస్ ఒకటి, రెండు సీట్లను కూడా గెలవడం కష్టం అనే విశ్లేషణలు వినిపించాయి .
అయితే ఓట్ల కౌంటింగ్ సమయం దగ్గర పడే కొద్ది, బీఆర్ఎస్ పై అంచనాలు పెరుగుతున్నాయి.
"""/" /
లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) జనాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనే దానిపై రకరకాల సర్వేలు తెరపైకి వస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం, ఐదు నెలల్లోనే తిరిగి పుంజుకుందని, ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందనే నివేదికలు తెరపైకి వస్తున్నాయి.
తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు, బీజేపీ నాలుగు , ఎంఐఎం ఒక స్థానంలో గెలవగా, బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించింది.
అయితే ఈసారి కాంగ్రెస్ కు గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఆ పార్టీ నేతల్లో ఉన్నాయి.
"""/" /
బిజెపి కూడా గతం కంటే తెలంగాణలో బలోపేతం అయ్యిందని, గతంలో వచ్చిన నాలుగు స్థానాలకు మించిన సీట్లు దక్కించుకునే అవకాశం ప్రచారం జరుగుతోంది.
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే గతంలో గెలిచిన 9 స్థానాలు రాకపోయినా, కనీసం 6 స్థానాల్లోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దీనికి అనేక కారణాలు ఉన్నాయి.కేసీఆర్ పై సానుభూతితో పాటు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను సక్రమంగా అమలు చేయకపోవడం, విద్యుత్ సరఫరా వంటివి సక్రమంగా లేకపోవడం, కరువు, పంటలను కొనుగోలు చేయకపోవడం, ఎలా ఎన్నో అంశాలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారి బీఆర్ఎస్ పై సానుకూలత పెంచాయనే సంకేతాలు వెలబడుతున్నాయి.
దీంతో పాటు తెలంగాణలో గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో కరువు రావడం, రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడడం, అకాల వర్షాలు, ధాన్యం కొనుగోలు సక్రమంగా లేకపోవడం వంటి వాటితో రైతులు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారనే అంచనాలు ఉన్నాయి.
హౌస్ నుంచి బయటకు వచ్చేసిన టేస్టీ తేజ… బిగ్ బాస్ 8 రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?