త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ..!

కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.సంక్రాంతి పండుగ తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది.

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ముందు భారీ మార్పులు చేయాలనే యోచనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్లు తెలుస్తోంది.

2023లో తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఆ తర్వాత వెంటనే 2024లో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో పొలిటికల్ ఈక్వేషన్స్ తగ్గట్లు మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ నుంచి కొత్త వారికి చోటు లభించవచ్చని చర్చ జోరుగా కొనసాగుతోంది.

మరోవైపు జనవరి 20తో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీకాలం ముగియనుంది.అలాగే తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పదవీకాలం కూడా ముగియనుంది.

ఈ క్రమంలో బండి సంజయ్ ను మంత్రివర్గంలోకి తీసుకుని, ఆయన స్థానంలో ఈటల రాజేందర్ కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

గతంలో జరిగిన కేబినెట్ విస్తరణలో 12 మంది మంత్రులకు మోదీ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.

దీంతో ఈసారి విస్తరణ ఏ విధంగా ఉండనుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

అమ్మ లేదనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను.. అభినయ ఎమోషనల్ పోస్ట్ వైరల్!