తెలంగాణ మంత్రివర్గ విస్తరణ .. ఆ నలుగురు ఎవరు 

అతి త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ ను విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రయత్నిస్తున్నారు.

ఎప్పటి నుంచో క్యాబినెట్ విస్తరణ పై వార్తలు వస్తున్నా.ఇప్పుడు మాత్రం క్యాబినెట్ ను విస్తరించాలని కాంగ్రెస్ సైతం సూచించినట్లు తెలుస్తోంది .

అందుకే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలి , ఏ ప్రాతిపదికన వారికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయంపై పార్టీ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రులు చర్చలు జరుపుతున్నారు.

కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నలుగురు పేర్లతో కూడిన జాబితాను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి అందించగా.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు పేర్లతో మరో జాబితాను అందజేశారు.

దీంతో ఈ ఆరుగురిలో నలుగురిని ఫైనల్ చేయాల్సి ఉంది.దీంతో ఎవరిని మంత్రులుగా ఎంపిక చేయాలనే దానిపైనే కసరత్తు జరుగుతుంది.

"""/" / ప్రస్తుతం తెలంగాణ మంత్రి వర్గంలో ఆరు పదవులు ఖాళీగా ఉన్నాయి.

ప్రస్తుతానికి నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత , మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , లంబాడీల నుంచి నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన ముదిరాజ్ కు చెందిన వాకేటి శ్రీహరి, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం .

"""/" / అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.

అలాగే భువనగిరి ఎంపీ సీటును గెలిపించిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Raj Gopal Reddy )పేరును మంత్రివర్గంలోకి పరిశీలించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హై కమాండ్ పెద్దలను  కోరినట్లు సమాచారం.

దీనిపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.

పాలస్తీనాకు సపోర్ట్ .. సింగపూర్‌లో అభియోగాలు, కేరళ వెళ్తానంటూ కోర్టుకెక్కిన భారత సంతతి మహిళ