తెలంగాణలో పెప్సికో సంస్థ విస్తరణ

తెలంగాణలో తన కార్యకలపాలను విస్తరించబోతున్నట్లు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ పెప్సికో సంస్థ ప్రకటించింది.

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ తో సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు.

ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ను మరింతగా విస్తరించనున్నట్లు పెప్సెకో సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

కాగా గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ లో ప్రస్తుతం 2,800 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా.

ఉద్యోగుల సంఖ్యను నాలుగు వేలకు పెంచబోతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.ఏడాది వ్యవధిలోనే అదనపు ఉద్యోగులను నియమించనున్నట్లు ప్రకటించింది.

వైరల్.. ఎలా వస్తాయి అయ్యా ఇలాంటి ఆలోచనలు.. సరికొత్తగా పెళ్లి కార్డు..