మీ మనవళ్లు, మనవరాళ్ళు వాడబోయే ఫ్యూచర్‌ స్మార్ట్ ఫోన్లు ఇవే.. షాక్‌ అంతే!

టెక్నాలజీ( Technology ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది.ఏరోజుకారోజు కొత్త కొత్త అప్డేట్లు నేటి తరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్( Smart Phone ) రూపురేఖలు అంతకంతకూ మారిపోతున్నాయి.

కాస్త గతంలోకి వెళితే, మార్టిన్‌కూపర్‌ 1973లో డబ్బా వంటి ఆకారంలో ఉండే మొదటి సెల్యులర్‌ ఫోన్‌ ని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు.

దీని బరువు అక్షరాలా 790గ్రాములు అంటే మీరు నమ్ముతారా? మరి నేడు మన చేతిలో ఇమిడిపోతున్న స్మార్ట్ ఫోన్ బరువు గురించి ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.

మనిషి తన సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు ఇలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని తనకి అనుకూలంగా తయారు చేసుకుంటున్నాడు.

ఇది ఒక్క ఫోన్ కే పరిమితం కాలేదు. """/" / అసలు విషయంలోకి వెళితే, ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి.

ఎలక్ట్రానిక్స్‌( Electronics ) విభాగంలో వాటి ఆవిష్కరణలు అగ్రస్థానాన్ని తాకాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ప్రత్యేకించి మొబైల్‌ తయారీరంగంలో టెక్నాలజీ అనేది భావితరాల భవిష్యత్తుని నిర్దేశిస్తుంది.బరువు తక్కువగా ఉండే మొబైల్‌లు గతంలో ఆదరణ పొందేవి.

ఇప్పడు ఫోల్డబుల్‌ ఫోన్లపై( Foldable Phones ) జనాలకు ఆసక్తి ఎక్కువవుతుంది.అయితే కంపెనీలు ఇంకా అడ్వాన్స్‌గా ఆలోచించి మడిచేఫోన్లను తయారు చేయనున్నాయని మీకు తెలుసా? """/" / తెలియకపోతే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోని చూస్తే మీకే అర్ధం అవుతుంది.

రాబోయే తరాలు ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ ని వాడబోతున్నాయో అని.అవును, మారుతున్న కాలాన్ని బట్టి యువత అభిరుచులు మారుతున్నాయి.

దానికి తగ్గట్టే సో కాల్డ్ కంపెనీలు యువతరం అభిరుచినిబట్టి, అవసరాల్ని బట్టి కళ్ళు చెదిరే గాడ్జెట్స్ ని మార్కెట్లోకి తెస్తున్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మీ కళ్ళు చెదిరిపోక తప్పదు.ఇక్కడ కనబడుతున్న స్మార్ట్ ఫోన్స్ మోడళ్లను పరిశీలిస్తే, వాటిని జేబులో కాదు.

మీ వాలెట్లో ఇముడ్చుకొని పయనించవచ్చు.అవును రాబోయే రోజుల్లో ఇలాంటి నూతన ఆవిష్కరణలు ఈ ప్రపంచాన్ని శాసించనున్నాయి.

ఈ సింపుల్ రెమెడీతో పాదాలను తెల్లగా మృదువుగా మెరిపించుకోండి!