నేడు బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య ఉత్కంఠ పోరు..!
TeluguStop.com
ఆసియా కప్( Asia Cup ) లో భాగంగా నేడు బంగ్లాదేశ్-శ్రీలంక( Bangladesh Vs Sri Lanka )జట్ల మధ్య తొలి ఉత్కంఠ భరితమైన పోరు జరగనుంది.
ఇటీవలే కాలంలో ఈ రెండు దేశాల ఆటగాళ్లు క్రికెట్ మైదానంలో చేసే అతి మాటల్లో చెప్పలేం.
ఒకరిపై మరొకరు పెంచుకున్న వైరం కారణంగా నేడు జరిగే మ్యాచ్ హై వోల్టేజ్ డ్రామాగా సాగే అవకాశం ఉంది.
ఈ పోరులో బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక చిత్తుగా ఓడనుందా.లేదంటే శ్రీలంక చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడనుందా అని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు.
"""/" /
శ్రీలంక జట్టుకు గాయాల కారణంగా దుష్మంత చమీరా( Dushmantha Chameera ), దిల్షాన్ మధుశంక, లాహిరు కుమార, వనిందు హసరంగ ఆటగాళ్లు దూరమయ్యారు.
దీంతో కీలక బౌలర్లు లేకుండానే లంక జట్టు బరిలోకి దిగుతోంది.ఈ నలుగురు ఆటగాళ్లలో ముగ్గురు ఆటగాళ్లు శ్రీలంక జట్టుకు ఎంతో కీలకం.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆటగాళ్లు లేని జట్టును బలహీనమైన జట్టుగా చెప్పవచ్చు.
గత ఏడాది జరిగిన ఆసియా కప్ టి20 ఫార్మాట్లో లంక విజయాలు సాధించడంలో ఈ బౌలర్లే కీలక పాత్ర పోషించారు.
ఈ బౌలర్ల స్థానంలో యువ బౌలర్లైన మహిశ్ తీక్షణ( Maheesh Theekshana ) బినుర ఫెర్నాండో, కసున్ రజిత బరిలోకి దిగుతున్నారు.
"""/" /
శ్రీలంక బ్యాటింగ్ విషయానికి వస్తే కాస్త బెటర్ గానే ఉంది.
బంగ్లాదేశ్ బౌలర్ షకిబ్ అల్ హసన్ ( Shakib Al Hasan )బౌలింగ్ ను లంకా బ్యాటర్లు నిలువరిస్తేనే పై చేయి సాధించే అవకాశం ఉంటుంది.
ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే.గాయాల కారణంగా కొంతమంది ఆటగాళ్లు బంగ్లాదేశ్ జట్టుకు దూరం అయినప్పటికీ శ్రీలంకతో పోలిస్తే చాలా బెటర్.
ఈ మ్యాచ్లో పిచ్ విషయానికి వస్తే.పేసర్లతోపాటు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది.
వాతావరణం పొడిగా ఉంటే ఇరుజట్లు భారీ స్కోరు ను నమోదు చేసే అవకాశం ఉందిఆసియా కప్ మ్యాచ్లను స్టార్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తోంది.
ఉచితంగా డిస్నీ హాట్ స్టార్ లో కూడా మ్యాచ్లను వీక్షించవచ్చు.భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం అవ్వనుంది.
సంధ్య థియేటర్ కు భారీ షాక్.. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదంటూ?