ఉత్కంఠగా హుజూరాబాద్ నియోజకవర్గం రాజకీయం...తెరాసకు చుక్కలేనా

తెలంగాణలో ఈటెల విషయంలో కేసీఆర్ వేసిన ఎత్తుగడ కేసీఆర్ కు గుదిబండలా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే ఈటెలకు టీఆర్ఎస్ కు మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్న పరిస్థితులలో ఈటెల ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే ఇప్పుడు పరిస్థితులు అవుననే సమాధానాలిస్తున్నాయి.

అయితే భూ కబ్జా ఆరోపణల కేసులో కేసీఆర్ మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత ఈటెలను హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒంటరిని చేయాలన్నది కేసీఆర్ వ్యూహం వేసినా, ఈటెల ఏమాత్రం తగ్గేది లేదంటూ కేసీఆర్ వ్యూహానికి ప్రతి వ్యూహం రచిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే తాజాగా ఢిల్లీకి మాజీ మంత్రి ఈటెల వెళ్లిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇంకా వీటిపై ఎటువంటి స్పష్టత లేదు.ఏది ఏమైనా హుజూరాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు.

అసలు సిసలైన రాజకీయ వ్యూహాలకు ఇటు టీఆర్ఎస్ పదునుపెడుతోంది.ఇక సమరం భారీ ఎత్తున ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే కెసీఆర్ కు ఈటెల బీజేపీ వైపు వెలనున్నాడనే సమాచారం రావడంతోఆ దిశగా వ్యూహాలు అమలుపరిచేందుకు కెసీఆర్ కరీంనగర్ నేతలను సన్నద్ధం చేస్తున్నట్టు సమాచారం.

రాజకీయ సన్యాసం తీసుకుంటా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఛాలెంజ్