అనంతపురంలో జనసేన నేత నాగబాబు పర్యటనపై ఉత్కంఠ
TeluguStop.com

అనంతపురం జిల్లాలో జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.


పర్యటనలో భాగంగా పార్టీ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు.అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట గుంతలమయంగా ఉన్న రోడ్లను పరిశీలించనున్నారు.


పర్యటన నేపథ్యంలో నాగబాబు ఇప్పటికే అనంతపురం చేరుకున్నారు.కానీ ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.
నగరంలో కానిస్టేబుల్ రాతపరీక్ష జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి లేదని తెలిపారు.
అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంపై జన సైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు.పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పర్యటన చేసి తీరుతామని స్పష్టం చేశారు.
దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రూ.16 కోట్లకు కన్యత్వాన్ని అమ్ముకున్న 22 ఏళ్ల యువతి.. ఆపై సంచలన ప్రకటన!