చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ..!

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వెలువడనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు మరికాసేపటిలో తీర్పును వెలువరించనుంది.కస్టడీ పిటిషన్ పై కోర్టులో బుధవారమే ఇరు పక్షాల వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే.

సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం.హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉన్నందున తీర్పును వాయిదా వేసింది.

అయితే హైకోర్టు నేటి కేసుల జాబితాలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ లేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం తీర్పును వెలువరిస్తామన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కస్టడీ పిటిషన్ పై ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని, రిమాండ్ కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఆయనను ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కూతుర్ని మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ దేవ్ షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?