మితిమీరిన ప్రాంక్‌.. చివ‌ర‌కు ప్రాణాలు పోగొట్టుకుంది..

సోష‌ల్ మీడియా విస్త‌రించిన‌ప్ప‌టి నుంచి మితిమీరిన ట్రెండ్ బాగా పాపుల‌ర్ అయిపోతుంది.ఇప్ప‌టికే చాలా ర‌కాల ట్రెండ్స్ మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చాయి.

మ‌రీ ముఖ్యంగా ఇందులో కొన్ని ప్రాణాల‌ను కూడా తీసేవిధంగా ఉంటున్నాయి.కొన్ని ట్రెండ్స్ అనేవి స‌మాజాన్ని చైత‌న్య‌ప‌రిచే విధంగా ఉంటే మ‌రి కొన్ని మాత్రం స‌మాజాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంటున్నాయి.

ఇందులో ప్రాంక్ వీడియోలు కూడా ఉంటున్నాయి.ప్రాంక్ వీడియోలు ఎంత‌లా పాపుల‌ర్ అవుతున్నాయో అంత‌లా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాయి.

అయితే ఇవి ఎంత‌లో ఉండాలో అంత‌లో ఉంటే బాగానే ఉంటుంది.కానీ మితిమీరితేనే చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు వ‌స్తుంది.

ఇక ఇప్పుడు కూడా ఓ యువ‌తి ఇలాంటి ప్రాంక్ వీడియో చేయ‌బోయి చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంది.

దాన్ని చూసిన వారంతా ఇదంతా అవ‌స‌ర‌మా అని కామెంట్లు చేస్తున్నారు.అయితే వివ‌రాల్లోకి వెళ్తే మెక్సికోలోని నౌక్‌చాట్ డి జుయారజ్‌లో ఈ దారుణ‌మైన ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

అయితే ఈ ప్రాంతంలో నివ‌సించే మ‌హిళ దెయ్యం లాగా వేశం వేసి ప్రాంక్ వీడియో చేయాల‌నుకుంది.

ఇందుకోసం తెల్ల‌టి బ‌ట్ట‌లు వేసుకుంది. """/"/ ఈ వేశంతో ఆమె వీధుల్లోకి వ‌చ్చి వ‌చ్చిపోయే వారిని భ‌య‌పెట్టాల‌నుకుంది.

ఇలా చాలామందిని భ‌య‌పెట్టింది.ఆమె వ‌య‌సు కూడా 20 నుంచి 25 మ‌ధ్య‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది.

లా లొరోనా అనే భయానక పాత్ర కు సంబంధించిన వేశం ఆమె వేసుకుంది.

ఇలా వేశం వేసుకుని ఎదురొచ్చిన వారంద‌రినీ త‌న బిడ్డ‌లు అంటూ పెద్ద‌గా అరుస్తూ భ‌య‌పెట్టేసింద‌తి.

ఇంకేముంది ఆమెను చూసిన వారంతా కూడా హ‌డ‌లెత్తిపోయారు.కానీ ఓ వ్య‌క్తి మాత్రం ఇలా భ‌య‌ప‌డ‌కుండా వెంట‌నే త‌న ద‌గ్గ‌ర ఉన్న గ‌న్ తీసుకుని కాల్పులు జ‌ర‌ప‌గా అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఆ గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిన స్టార్ యాంకర్ రష్మీ.. అసలేం జరిగిందంటే?