ఈ పండ్లను అధికంగా తీసుకుంటే బరువు పెరగడం ఖాయం!
TeluguStop.com
ఇటీవల కాలంలో వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.
మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మద్య పానం, ఒత్తిడి, ఏవైనా అనారోగ్య సమస్యలు, థైరాయిడ్, శరీరానికి శ్రమ లేకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరిగిపోతుంటారు.
దాంతో పెరిగిన బరువును తగ్గించుకునేందుకు అనేక తిప్పలు పడుతుంటారు.వ్యాయామాలు చేస్తారు, డైట్ ఫాలో అవుతారు, ఇతర ఆహారలకు బదులు పండ్లను అధికంగా తీసుకుంటారు.
అయితే బరువు తగ్గాలని ప్రయత్నించే వారు కొన్ని కొన్ని పండ్లతో జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే వెయిట్ లాస్ అవ్వడం కాదు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.మరి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పండ్లు.ప్రస్తుత సమ్మర్‌లో ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తుంటాయి.
అయితే మామిడి పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి.అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లకు దూరంగా ఉండటమే మేలు.
అలాగే సపోటా పండు కూడా వెయిట్ గెయిన్ అయ్యేందుకు సహకరిస్తుంది.ఈ రుచికరమైన పండ్లలో క్యాలరీల కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది.
అందుకే వెయిట్ లాస్ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నించే వారు సపోటా పండ్లను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.
విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు ఉండే పండ్లలో అవకాడో కూడా ఒకటి.
"""/"/ అయితే పోషకాలే కాదు.క్యాలరీలు కూడా ఇందులో అధికంగానే ఉంటాయి.
అందుకే బరువు తగ్గాలనుకునే వారు అవకాడో పండ్లను కాస్త తక్కువగా తీసుకోవాలి.సూపర్ ఫుడ్ గా చెప్పుకునే అరటి పండు కూడా బరువు పెరిగేలా చేస్తుంది.
అరటి పండులో బోలెడన్ని పోషకాలతో పాటు క్యాలరీలూ ఎక్కువగా ఉంటాయి.కాబట్టి, వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్న వారు రోజుకు ఒక అరటి పండుకు మించి తినకూడదు.
పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే సినిమా ఫ్లాపేనా… ఇదేం లాజిక్?