వర్జీనియా: రిపబ్లికన్లపై విరుచుకుపడిన ఒబామా.. ప్రజాస్వామ్యానికే ముప్పంటూ విమర్శలు

రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.రిపబ్లికన్‌లను ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన అభివర్ణించారు.

వచ్చే ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికలలో పార్టీ అవకాశాలకు పరీక్షకు చెప్పబడుతున్న వర్జీనియా రాష్ట్ర ఎన్నికలలో డెమొక్రాట్లకు మద్ధతు ఇవ్వాలని బరాక్ ఒబామా శనివారం ఓటర్లను కోరారు.

డెమొక్రాట్ పార్టీకి చెందిన టెర్రీ మెక్‌ఆలిఫ్.వర్జీనియా గవర్నర్‌గా రెండోసారి పోటీ చేస్తున్నారు.

అయితే ఇటీవలి ఎన్నికలలో అతని ఆధిక్యం పడిపోయింది.రిపబ్లికన్ అభ్యర్ధి గ్లెన్ యంగ్‌కిన్‌తో నవంబర్ 2న జరిగే ఎన్నికల్లో ఆలిఫ్ తలపడనున్నారు.

రిచ్‌మండ్‌లోని వర్జీనియా కామన్‌వెల్త్ యూనివర్సిటీలో శనివారం వందలాది మంది మద్ధతుదారులను ఉద్దేశించి ఒబామా మాట్లాడుతూ.

యంగ్‌కిన్ టీచింగ్ ఉద్యోగాలను తగ్గిస్తారని ఆరోపించారు.అబార్షన్ యాక్సెస్‌ను పరిమితం చేస్తారని, గత ఎన్నికల్లో జో బైడెన్ తన నుంచి అధికారాన్ని దొంగిలించారని అమెరికన్లను ఒప్పించేందుకు ట్రంప్ చేసే మోసపూరిత ప్రచారానికి యంగ్‌కిన్ మద్ధతు ఇస్తారని ఒబామా అన్నారు.

గత అధ్యక్ష ఎన్నికల్లో ఉపయోగించిన ఓటింగ్ యంత్రాలను మళ్లీ ఆడిట్ చేయాలనుకుంటున్నట్లు కూడా అతను చెప్పాడని మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

కాగా.మధ్యంతర ఎన్నికలలో మద్ధతుదారుల మధ్య ఓటింగ్ తక్కువగా వుండవచ్చని మెక్ఆలిఫ్ క్యాంప్ భయపడుతోంది.

చివరి దశలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు గాను దేశ ప్రథమ మహిళ జిల్ బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా పార్టీకి చెందిన కొంతమంది స్టార్లను ఆలిఫ్ రంగంలోకి దించారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ 10 పాయింట్ల తేడాతో వర్జీనియాను కైవసం చేసుున్నాడు.

చివరిసారిగా 2009లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఇక్కడ గెలిచారు.మోన్‌మౌత్ యూనివర్సిటీ ఈ వారం విడుదల చేసిన ఒక సర్వేలో డెమొక్రాట్ల ఆధిపత్యం తగ్గుతున్నట్లు చెప్పడంతో మెక్‌ఆలిఫ్- యంగ్‌కిన్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం వుందని నిపుణులు భావిస్తున్నారు.

అధ్యక్షుడిగా తప్పుకున్నాక కూడా ప్రజాదరణ ఏమాత్రం తగ్గని బరాక్ ఒబామా .వర్జీనియాలోని నల్లజాతీయుల ఓటర్లను రాబడతారని డెమొక్రాట్ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు.

వచ్చే ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉత్తర వర్జీనియాలోని వాషింగ్టన్ శివారు ప్రాంతాలు డెమొక్రాట్లకు బలమైన కోటగా వున్నాయి.అయితే సాంప్రదాయక దక్షిణ, నైరుతి వర్జీనియాలు, రిచ్‌మండ్ ప్రాంతం ఎటువైపు మొగ్గుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇదేందయ్యా ఇదే.. స్కూల్ యూనిఫామ్ తొడుక్కున్న కుక్క.. వీడియో వైరల్..