‘‘ వాళ్లంతా నరకంలో కుళ్లిపోతారు ’’.. బైడెన్‌ పేరు ప్రస్తావించకుండా క్రిస్మస్ విషెస్, ట్రంప్‌ పోస్ట్‌ వివాదాస్పదం

‘‘ వాళ్లంతా నరకంలో కుళ్లిపోతారు ’’ బైడెన్‌ పేరు ప్రస్తావించకుండా క్రిస్మస్ విషెస్, ట్రంప్‌ పోస్ట్‌ వివాదాస్పదం

క్రిస్మస్ వేడుకలను ( Christmas Celebrations )ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా దేశాధినేతలు, ప్రముఖులు క్రిస్మస్ విషెస్ తెలియజేశారు.

‘‘ వాళ్లంతా నరకంలో కుళ్లిపోతారు ’’ బైడెన్‌ పేరు ప్రస్తావించకుండా క్రిస్మస్ విషెస్, ట్రంప్‌ పోస్ట్‌ వివాదాస్పదం

అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) మాత్రం విచిత్రంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘ వాళ్లంతా నరకంలో కుళ్లిపోతారు ’’ బైడెన్‌ పేరు ప్రస్తావించకుండా క్రిస్మస్ విషెస్, ట్రంప్‌ పోస్ట్‌ వివాదాస్పదం

దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న వ్యక్తులు రోట్ ఇన్ హెల్ (నరకంలో కుళ్లిపోవాలి) కావాలంటూ తన ట్రూత్ సోషల్ ‌లో పోస్ట్ పెట్టారు.

వంకర మనిషైన జో బైడెన్‌కు( Joe Biden ) క్రిస్మస్ శుభాకాంక్షలంటూ ట్రంప్ పెట్టిన పోస్ట్ వివాదాస్పదమైంది.

ఒకప్పుడు గొప్పగా వున్న మన అమెరికాని నాశనం చేయాలని యూఎస్ఏ పోకిరీలు ప్రయత్నిస్తున్నారంటూ పేరు చెప్పకుండా ట్రంప్ వ్యాఖ్యానించారు.

ద్రవ్యోల్భణం, ఆఫ్ఘనిస్తాన్ సరెండర్, గ్రీన్ న్యూ స్కామ్, అధిక పన్నులు, శక్తి స్వాతంత్ర్యం, వోక్ మిలిటరీ, రష్యా - ఉక్రెయిన్, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాలు ఇంకా మరెన్నో ఘటనలు మన అమెరికాను నాశనం చేయాలని చూస్తున్నాయని ట్రంప్ అన్నారు.

"""/" / ఇకపోతే.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

దేశ అత్యున్నత పదవికి ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్ట్ ( Colorado Supreme Court )సంచలన తీర్పు వెలువరించింది.

రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిని నిర్ణయించే ప్రక్రియలో భాగంగా నిర్వహించే కొలరాడో స్టేట్ ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికల్లో ఆయన పేరును చేర్చరాదని ధర్మాసనం వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే.2021 జనవరి 6న యూఎస్ కేపిటల్‌పై దాడి కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

"""/" / 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్.కొత్తగా ఎన్నికైన డెమొక్రాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా వ్యవహరించారని న్యాయస్థానం తేల్చింది.

ఈ నేరానికి గాను అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3వ నిబంధన ప్రకారం ట్రంప్.

రాజ్యాంగ పదవులకు అనర్హుడని ఏడుగురు సభ్యులతో కూడిన కొలరాడో సుప్రీంకోర్ట్ 4 - 3 మెజారిటీతో తీర్పును వెలువరించింది.

అయితే దీనిపై ఫెడరల్ సుప్రీంకోర్టులో అప్పీల్‌కు( Federal Supreme Court ) అవకాశం కల్పించింది.

కాగా.ఈ కేసులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు పలువురి నుంచి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం.

జడ్జీలపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నట్లు అడ్వాన్స్‌డ్ డెమొక్రసీ అనే సంస్థ తెలిపింది.

25 ఏళ్ల తర్వాత మరోమారు తాడోపేడో తేల్చుకోనున్న న్యూజిలాండ్‌, భారత్