అమెరికా : హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరోకు గట్టి కౌంటరిచ్చిన డొనాల్డ్ ట్రంప్
TeluguStop.com
గోథమ్ అవార్డ్స్( Gotham Awards 2023 ) ప్రధానోత్సవ కార్యక్రమంలో హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాబర్ట్ డి నీరో( Robert De Niro ) తనపై చేసిన వ్యాఖ్యలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) విరుచుకుపడ్డారు.
అసలేం జరిగిందంటే .రాబర్ట్ తన ప్రసంగం ప్రారంభించిన వెంటనే తాను నటించిన తాజా సినిమా ‘‘ ది కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’’ కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
ఆ వెంటనే తన ఫోన్ తీసుకుని ట్రంప్ ఇంకెన్ని అబద్ధాలు చెబుతారంటూ ఆయన గతంలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.
చరిత్ర ఇకపై చరిత్ర కాదు.నిజం నిజం కాదు, వాస్తవాలు సైతం ప్రత్యామ్నాయ వాస్తవాలతో భర్తీ చేయబడుతున్నాయని రాబర్ట్ అన్నారు.
"""/" /
ఫ్లోరిడాలో( Florida ) యువ విద్యార్ధులకు బానిసలు వారి వ్యక్తిగత ప్రయోజనం కోసం వర్తించే నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా బోధిస్తారని దుయ్యబట్టారు.
అబద్ధం అనేది చార్లటన్ ఆయుధశాలలో మరొక సాధనంగా మారిందని ఎద్దేవా చేశారు.డొనాల్డ్ ట్రంప్ తన నాలుగేళ్ల పాలనా కాలంలో దాదాపు 30 వేలకు పైగా అబద్ధాలు చెప్పారని రాబర్ట్ ధ్వజమెత్తారు.
ప్రస్తుతం ట్రంప్( Trump ) చేస్తున్న ప్రచారంలో ప్రతీకారం తీర్చుకోవాలనే భావనే ఎక్కువగా కనిపిస్తోందని రాబర్ట్ డీ నీరో ఎద్దేవా చేశారు.
ఆయన బలహీనులపై దాడి చేస్తాడు, ప్రకృతి వనరులను నాశనం చేస్తాడని హాలీవుడ్ స్టార్ మండిపడ్డారు.
"""/" /
ఇది ట్రంప్ దృష్టికి రావడంతో ఆయన తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ సోషల్‌లోకి( Truth Social ) వెళ్లి రాబర్ట్ నీరోకు ఘాటుగా బదులిచ్చారు .
‘‘రాబర్ట్ డీ నీరో , అతనిలో నటనా ప్రతిభ బాగా తగ్గిపోయింది, ఇప్పుడు చిత్రీకరించబడిన కీర్తితో , అతని అసహ్యకరమైన భాష మనదేశాన్ని ఎంతో అగౌరవపరిచింది .
ఆయన సినిమాలలో, దేశవ్యాప్తంగా ఇచ్చిన ప్రదర్శనలలో తక్కువ రేటింగ్ పొంది, అకాడమీ అవార్డులను నాశనం చేసిన ఫూల్స్‌తో చూడలేని వ్యక్తిగా మారాడు .
’’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.
దుండగుల చేతిలో దారుణ హత్య .. భారతీయ విద్యార్ధికి కెనడాలో ఘన నివాళి