పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో వాజ్ పాయ్ పేరు ?

ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో ఇటు ఏపీ లోని అధికార ప్రతిపక్షాలకు మధ్యనే కాకుండా , కేంద్రం చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి.

ముఖ్యంగా ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఎన్నో రకాలుగా రాజకీయాలు జరుగుతున్నాయి.

ఏదో రకంగా ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి, ఆ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకోవాలని ఏపీ అధికార పార్టీ వైసిపి భావిస్తోంది.

అసలు ఈ పోలవరం ప్రాజెక్టు ఈ స్థాయికి రావడానికి కారణం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కాలని వైసీపీ ప్లాన్ చేస్తుండగా, ఇప్పుడు ఈ వ్యవహారంలోకి మాజీ ప్రధానమంత్రి, దివంగత వాజ్ పాయ్ పేరును వైసిపి తెర మీదకు తీసుకు వస్తోంది.

"""/"/ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు విషయానికి సంబంధించి విగ్రహాల ఏర్పాటు విషయమై తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఈ ప్రాజెక్ట్ పై ఎవరెవరి విగ్రహాలు పెట్టాలి అనే విషయం పై తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్టు వద్ద దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటూ అప్పుడే టిడిపి విమర్శలు మొదలుపెట్టగా, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రాంతంలో వాజ్ పాయ్ విగ్రహాన్ని పెట్టాలంటూ ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.

ఈ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే, కేంద్ర నిధులతో తామే సొంతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఆయన చెప్పుకొస్తున్నారు.

ఈ వ్యవహారం కాస్త రెండు పార్టీల మధ్య వివాదం ముదిరేలా వ్యవహారం కనిపిస్తోంది.

వాజ్ పాయ్ జీవితం వివాదాలకు దూరంగా ఉంటూ, వివాదరహితుడిగా పేరు పొందిన వాజ్ పాయ్ పేరు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కారణంగా మరోసారి తెరపైకి రావడం,  ఆయన విగ్రహం చుట్టూ రాజకీయం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తుండడంతో,  ఈ వ్యవహారంలో ఏపీ అధికార పార్టీ వైసిపి ఏ విధంగా స్పందిస్తుంది అనేది తేలాల్సి ఉంది.

మోకాళ్ల నొప్పులకు 20 నిమిషాల్లో చెక్.. ఫిట్‌నెస్ ట్రైనర్ సీక్రెట్ రొటీన్ లీక్!