ఇదేందయ్యా.. ఇంజనీర్ కోసం పంది ఎముకల దండను తయారు చేయించిన మాజీ ఎంపీ..

ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్‌ మాజీ ఎంపీ లక్ష్మణ్‌ తుడు( Laxman Tudu ) బరిపడలోని పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ) ఆఫీస్‌లో ఓ సీన్‌ క్రియేట్ చేశారు.

అతను తన భార్య, మద్దతుదారులతో కలిసి రెండు దండలు తయారు చేయించారు.వాటిలో ఒకటి పూలతో, మరొకటి పంది ఎముకలతో( Pig Bones Garland ) తయారు చేయించారు.

అసిస్టెంట్ ఇంజనీర్ రబీ మిశ్రా( Rabi Mishra ) కోసమే ఈ రెండు దండలను చేశారు.

తాను లంచం అడిగినట్లు మిశ్రా పుకార్లు వ్యాప్తి చేశారని లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పని చేశారు.

"""/" / రోడ్డు వెడల్పు చేయాలని తాను పీడబ్ల్యూడీని కోరానని, అయితే ప్రాజెక్టు పూర్తి కాగానే శిలాఫలకంలో తన పేరు కాకుండా మంత్రి సుదామ్ మరాండి పేరును పేర్కొన్నారని మాజీ ఎంపీ లక్ష్మణ్‌ వివరించారు.

దీంతో కలత చెందిన లక్ష్మణ్ మిశ్రాతో మాట్లాడి ఆవేదన వ్యక్తం చేశారట.రోడ్డు కూడా నాసిరకంగా ఉందని సదరు ఇంజనీర్‌కి తెలిపారు.

అయితే మిశ్రా లక్ష్మణ్‌ లంచం పొందనందుకే ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారంటూ తప్పుడు ప్రచారం చేశారట.

మాజీ ఎంపీ మానసిక స్థితి సరిగా లేదని కూడా మిశ్రా పేర్కొన్నారట. """/" / ఈ ఆరోపణలతో దిగ్భ్రాంతికి గురైన లక్ష్మణ్‌.

విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ పీడబ్ల్యూడీ ఆఫీస్ ను సందర్శించారు.ఆరోపణలు నిజమైతే మిశ్రాకు పూలమాల వేసి నివాళులర్పిస్తానని ఆయన అన్నారు.

కానీ ఆరోపణలు అబద్ధమని రుజువైతే, అతను మిశ్రాను పంది ఎముకలతో చేసిన దండను ధరించేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

అయితే లక్ష్మణ్‌ వచ్చిన సమయంలో మిశ్రా ఆఫీసులో లేరు.ఈ ఘటనపై పీడబ్ల్యూడీ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, వారు విచారణ జరుపుతామన్నారు.

ప్రణయగోదారి సినిమా రివ్యూ!