చంద్రబాబుపై మాజీమంత్రి పేర్ని నాని విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు.చంద్రబాబును చంపాలని ఎవరనుకుంటారన్నారు.

2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయాల్లో కనిపించరని చెప్పారు.చంద్రబాబు చేసిన పాపాలకు అంతే లేదన్నారు.

మొన్నటివరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విమర్శలు చేశారన్న ఆయన ఇప్పుడేమో తాము వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామంటున్నారని ఆరోపించారు.

ఏపీలో అప్పులపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని, ఆయనెప్పుడు ప్రతిపక్ష నేతగానే ఉండాలని వెల్లడించారు.

ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేయొద్దని స్పష్టం చేశారు.

మన దర్శకులతో ఇతర భాషల హీరోలు సినిమాలు చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే..?