జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని బలి చేశారు.. రోజా షాకింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandra Babu Naidu ) ఇటీవల తిరుపతి లడ్డు ( Tirupathi Laddu ) లో కల్తీ జరిగిందంటూ ఆరోపణలు చేశారు కానీ ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

ఇప్పటివరకు కల్తీ జరిగిందని ఎలాంటి ఆధారాలను బయట పెట్టకపోవడంతో పలువురు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం రాజకీయాల కోసమే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.ఇకపోతే ఈ విషయంపై వైకాపా నాయకులకు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / తాజాగా సినీ నటి మాజీ మంత్రి ఆర్కే రోజా( Roja ) సైతం కూటమి ప్రభుత్వం గురించి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు దేవుడిని కూడా రాజకీయాలలోకి లాగుతున్నారని ఆమె మండిపడ్డారు.తన సొంత ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని, ఆయన స్వార్థం రాజకీయాలకు ఎవరినైనా బలి చేస్తారని ధ్వజమెత్తారు.

గతంలో పురందేశ్వరి భర్తను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశారు. """/" / ఇక హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్( NTR ) లను కూడా తన రాజకీయ స్వలాభం కోసం వాడుకొని బలి చేశారని రోజం మండిపడ్డారు .

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీటు కోసం పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారు అంటూ రోజా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంపై చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక తిరుపతి లడ్డు వ్యవహారం కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చలకు కారణమైంది.

మరి ఇందులో నిజా నిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.ఇక తిరుమల ప్రసాదంగా పంపిణీ చేసే లడ్డులో కల్తీ జరిగిందనే విషయం తెలియడంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత దీక్ష కూడా చేపట్టిన సంగతి మనకు తెలిసిందే.

11 రోజులు వరకు ఈ దీక్ష కొనసాగుతుందని పవన్ తెలిపారు.

టాలీవుడ్ లో ఒక్కరే బాస్… చిరంజీవిపై దిల్ రాజు కామెంట్స్ వైరల్!