రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి - ప్రత్తిపాటి పుల్లారావు
TeluguStop.com
పల్నాడు జిల్లా: మాజీ మంత్రి, ప్రత్తిపాటి పుల్లారావు కామెంట్స్.మూడు రాజధానుల పై మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు మూడు రాజధానులపై రాజీనామా చేసి ఎన్నికలకు రాలేని పక్షంలో కనీసం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని ప్రత్తిపాటి డిమాండ్.
చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చర్చకు రావాలి.
విధ్వంసం, అరాచకం, అవాస్తవాలు, అబద్దాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు కాలక్షేపం చేస్తూ కాలం గడుపుతున్నారు.
ఉత్త కబుర్లు.ఉత్త మాటలు చెప్పి కాలక్షేపం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రంలో ప్రజలు విష, డెంగ్యూ జ్వరాలతో బాధపడుతుంటే పట్టించుకున్న దాఖలాలు లేవు.
గ్రామాలలో కనీసం శానిటేషన్ చేద్దామన్న వచ్చిన ఆర్థిక సంఘం నిధులు లాగేస్తున్నారు.చిలకలూరిపేట నియోజకవర్గం కొండవీడు దళితవాడలో విష జ్వరంతో 35 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు.
రాష్ట్రంలో ఆసుపత్రులు, ల్యాబ్ లు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి.ఇప్పటికైనా మాటలు చెప్పి కాలం గడపటం కాకుండా క్షేత్రస్థాయిలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు తప్ప వైసీపీ ప్రభుత్వం ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు.
రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులపై ప్రయాణం చేయాలంటే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరచి ఎలాగో రోడ్లు వేయలేని పరిస్థితిలో కనీసం గుంతలు పూడ్చి ప్రజల ఇబ్బందులు తొలగించాలి.
చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా తాను చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత మంత్రి ఒక్క రూపాయి నిధులు తెచ్చి అభివృద్ధి చేసిందా చెప్పాలి.
అప్పట్లో తాను తెచ్చిన కేంద్రీయ విద్యాలయం, 100 పడకల ఆసుపత్రి, చిలకలూరిపేట బైపాస్ పనులను ఇప్పటికీ పూర్తి చేయలేని పరిస్థితులో ఉన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఓటేశామని ఆలోచిస్తున్నారు.
బుద్ధి చెప్పటానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
విషమంగానే శ్రీతేజ ఆరోగ్యం.. మనుషుల్ని సైతం బాలుడు గుర్తు పట్టడం లేదా?