హత్య కేసులో వైసిపి మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ 

హత్య కేసులో వైసిపి మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ 

ఓ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వైసిపి నేత మాజీ మంత్రి విశ్వరూపం కుమారుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

హత్య కేసులో వైసిపి మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ 

వివరాల్లోకి వెళితే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు.

హత్య కేసులో వైసిపి మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ 

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్( Ex-Minister Pinipe Viswaroop ) కుమారుడు శ్రీకాంత్ ఉన్నట్లు సమాచారం.

ఈ కేసులో నిందితుడైన ధర్మేష్ ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ తో పాటు , మరో నలుగురు నిందితులుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

దీంతో ఈ కేసు దర్యాప్తుని వేగవంతం చేసిన పోలీసులు దీనిపై శ్రీకాంత్ ను అరెస్టు చేసినట్లు సమాచారం .

తమిళనాడులోని మధురై లో శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు .ఈ హత్య కేసులో శ్రీకాంత్ ఏ వన్ నిందితుడిగా ఉన్నారు.

"""/" / అంబేద్కర్ కోనసీమ జిల్లా( Ambedkar Konaseema District ) పి గన్నవరం మండలం అయినవిల్లికి చెందిన దళిత యువకుడు మిస్సింగ్,  ఆపై అనుమానాస్పద మృతి కేసులో శ్రీకాంత్ పేరును ఏ 1  గా చేర్చడం చర్చనీయాంశం గా మారింది.

  దళిత యువకుడిది అనుమానస్పధ మృతిగా పోలీసులు  ముందుగా భావించినా,  ఇది హత్యగా విచారణ ద్వారా పోలీసులు నిర్ధారించారు.

పినిపే శ్రీకాంత్( Pinipe Srikanth ) ఆదేశాల మేరకే దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ ను( Janupalli Durgaprasad ) హత్య చేశారని పోలీసుల అదుపులో ఉన్న ధర్మేష్ అనే యువకుడు విచారణలో వెల్లడించడంతో పినిపే శ్రీకాంత్ అజ్ఞాతంలోకి వెళ్లారు.

ఈ కేసు మొత్తం వ్యవహారంలో నలుగురు ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.తమిళనాడులోని మధురై లో అరెస్ట్ అయిన శ్రీకాంత్ ను నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు తీసుకువస్తున్నారు.

"""/" / H3 Class=subheader-styleఅరెస్టు అక్రమం : పినిపె విశ్వరూప్ /h3p కోనసీమలో కక్ష రాజకీయాలకు కూటమి ప్రభుత్వం ఆద్యం పోస్తోందని , టిడిపి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ నేత మాజీమంత్రి విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయ కక్షతోనే తన కుమారుడిని హత్య కేసులో ఇరికించారని విశ్వరూప్ ఆవేదన చెందారు  కావాలని నా కుమారుడుని హత్య కేసులో అరెస్ట్ చేశారు .

హత్య కేసుతో నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు.చనిపోయిన వ్యక్తి మా పార్టీ కార్యకర్త .

ఎఫ్ఐఆర్ లో నా కొడుకు పేరు ఎక్కడా లేదు.  అక్రమంగా నా కుమారుడిని అరెస్ట్ చేశారు.

రాజకీయ కక్షతో నిందితులతో నా కొడుకు పేరు చెప్పించి తప్పుడు కేసు పెట్టారు అని విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  తమిళనాడులోని మధురై ఆలయ సందర్శనకు వెళ్లి వస్తున్న సమయంలో నా కుమారుడిని అరెస్ట్ చేశారని విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు .

పహల్గామ్ ఉగ్రవాదుల దాడి .. కెనడా వ్యాప్తంగా ఎన్ఆర్ఐల నిరసనలు