తండ్రిని జైల్లో వదిలేసి లోకేష్ 25 రోజులు ఢిల్లీలో ఉన్నాడు – మాజీ మంత్రి పేర్ని నాని
TeluguStop.com
అమరావతి: మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్.తండ్రిని జైల్లో వదిలేసి లోకేష్ 25 రోజులు ఢిల్లీలో ఉన్నాడు.
జైలు ముందు మీడియా తో మాట్లాడుతూ ఫ్యామిలీ సెంటిమెంట్ ను పండించారు.ఢిల్లీ లాయర్లు బెజవాడ బజార్ లలో,మీ అమ్మను రాజమండ్రి రోడ్లపై వదిలేసి ఢిల్లీ ఎందుకు వెళ్లారు?మేనేజ్ చేయడం అనేది చంద్రబాబు దగ్గర నుంచి ఉంది.
ఎవరి కాళ్ళు పట్టుకుండామని ఢిల్లీ వెళ్ళాడు?సిగ్గు లేకుండా స్కాం లో ఉన్న 27 కోట్లు పార్టీ అకౌంట్ లో వేసుకున్నారు.
ఇప్పటికీ 3 వేల కోట్ల స్కాం జరిగిందని వైసీపీ చెబుతుంది.సీమెన్స్ ఇస్తానన్న 3 వేల కోట్లు ఎక్కడున్నాయో చెప్పాలని లోకేష్ కు సవాల్ విసురుతున్న.
చంద్రబాబు నిజాయతీపరుడైతే మీ ఆస్తులు, వ్యాపారాల మీద కోర్టు మానిటర్ ఎంక్వైరి కీ మీరు సిద్ధమా?లోకేష్ నా ఛాలెంజ్ కి స్పందించాలి.
పవన్ పై పేర్ని నాని కామెంట్స్.జగన్ కు దమ్ముంది కాబట్టే ఏ పార్టీ తో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళాడు.
పవన్ వ్యాఖ్యలను సొంత పార్టీ వాళ్లే నమ్మడం లేదు.బీజేపీ కంటే నాకు చంద్రబాబు ముఖ్యమని పవన్ చెబుతున్నారు.
రాజశేఖర్ రెడ్డి మీద పవన్ ఏం పోరాటం చేసాడో చెప్పాలి.పవన్ వస్తే కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి తీసుకెళ్లి చూపిస్తాను.
అక్కడ బ్రిడ్జి ఉందొ లేదో చూపిస్తాను.సిగ్గు లేకుండా ఏదీపడితే అది మాట్లాడుతున్నాడు.
పవన్ కు ఏపీ లో ఇళ్లు లేదు.ఆధార్ కార్డు లేదు.
కాపురం లేదు.NDA లో భాగస్వామి అయితే తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చావు?NDA లో ఉంటే తెలంగాణ లో బీజేపీ సీట్ల గురించి మాట్లాడుకున్నారా?32 నియోజకర్గాల్లో గ్లాస్ గుర్తు కేటాయించమని ఈసీ కి ఎలా ఇచ్చారు?మున్నూరు కాపుల ఓట్ల కోసం కేసీఆర్ చెప్తే 32 స్థానాలు ప్రకటించాడు.
తెలంగాణ లో మున్నూరు కాపులు,ఏపీలో కాపులు ఉన్న దగ్గర మాత్రమే జనసేన పోటీ చేస్తుంది.
చంద్రబాబు, పవన్ ఏపీకి పట్టిన మహమ్మారి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి13, గురువారం 2025