నూజివీడు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పార్థసారథి ఖరారు..!!
TeluguStop.com
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఒక్కొక్కరిగా అభ్యర్థులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా నూజివీడు సీటును చంద్రబాబు ఖరారు చేశారు. """/" /
నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి పార్థసారథికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే నూజివీడులో టీడీపీ వరుసగా రెండు సార్లు పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా నూజివీడులో టీడీపీ జెండాను ఎగురవేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే పార్థసారథికి ( Parthasarathy )టికెట్ ను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే పార్థసారథి ప్రస్తుతం పెనమలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.పార్థసారథిని పక్కనపెట్టి జోగి రమేశ్ కి వైసీపీ టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన వైసీపీ( YCP )ని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే చంద్రబాబుతో రెండుసార్లు సమావేశమైన పార్థసారథి ఫిబ్రవరి మొదటివారంలో టీడీపీ కండువా కప్పుకోనే అవకాశం ఉందని సమాచారం.
ఆరోగ్యం విషయంలో జ్యూసులు చేసే మ్యాజిక్.. ఏది దేనికి పనికొస్తుందంటే?