తెరపైకి మాజీ మంత్రి కారుమూరి అవినీతి ? సిఐడి విచారణ ?

గత వైసిపి( YCP ) ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు,  మాజీ మంత్రులు చేసిన అవినీతి వ్యవహారాలు ను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది ఏపీలోని టిడిపి అధికార కూటమి ప్రభుత్వం.

గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు,  వివిధ వ్యవహారాల్లో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లుగా ప్రభుత్వం చేయిస్తున్న విచారణలో తేలుతుండడంతో బాధ్యులపై వరుసగా కేసులు నమోదు చేస్తూ,  వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఈరోజు ఉదయమే వైసిపి నేత,  మాజీ మంత్రి జోగి రమేష్ ( Former Minister Jogi Ramesh )నివాసం పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లుగా,  జోగి రమేష్,  ఆయన కుటుంబ సభ్యులు ఈ అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకోగా , తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి, ,తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరావు ( Former MLA Karumuru Nageswarao )అవినీతి వ్యవహారాల పై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

"""/" / ముఖ్యంగా 2019 -  24 మధ్య జారీ చేసిన టీడీఆర్ బాండ్ల లో భారీగా అక్రమాలు జరిగినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా,  పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడినట్లు అనుమానిస్తోంది.

  దీంతో దీనిపై అంతర్గత విచారణ చేయించాలని నిర్ణయించుకుంది .2019 - 24 మధ్య అప్పటి ప్రభుత్వం టిడిఆర్ బాండ్లను జారీ చేసింది.

ఈ బాండ్ ల వ్యవహారంలో భారీగా కుంభకోణం జరిగినట్లు టిడిపి( TDP ) ప్రభుత్వం భావిస్తోంది.

  తణుకులో జారీచేసిన బాండ్ల వ్యవహారంలో 691 కోట్ల స్కాం జరిగినట్లుగా ఆరోపణలు రావడం,  రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే విధంగా అవినీతి జరిగి ఉంటుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

"""/" / తణుకులో ఎకరం 55 లక్షలకు కొనుగోలు P టీడిఆర్ బాండ్లలో 10 కోట్ల విలువ చూపినట్లు గుర్తించింది.

స్థల సేకరణ సమయంలో ఎకరాల లెక్కల్లో చూపించి బాండ్ల జారీలో చదరపు గజాల్లో స్థలం లెక్కించారని గుర్తించింది .

దీంతో దీనిపై ఏసీబీ విచారణకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసిన ఏసీబీ తణుకులో టిడిఆర్ బాండ్ల స్కాం ( TDR Bonds Scam )జరిగినట్లు గుర్తించి తాజాగా ఏపీ ప్రభుత్వానికి నివేదికను ఏసీబీ అందించింది .

ఈ కుంభ కోణంపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది .

ఈ వ్యవహారం పూర్తిస్థాయిలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించే అంశం  పైన పరిశీలిస్తున్నారు .

సిఐడి విచారణకు ఆదేశిస్తే అసలు ఈ వ్యవహారంలో ఉన్న సూత్రధారులు ఎవరు ?  ఎంతవరకు అవినీతి జరిగింది అనే అంశం పైన పూర్తిస్థాయిలో తేలుతుందని భావిస్తోంది.

ఈ అవినీతి వ్యవహారంలో అప్పటి మంత్రి , తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు పైనే ఆరోపణలు రావడం,  ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉండడంతో న్యాయపరమైన అభిప్రాయాలను తీసుకుని ఈ కేసులో ముందుకు వెళ్లే విధంగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

చుట్టమల్లే సాంగ్ తీసినది కొరటాల కాదా.. ఎవరో తెలుసా?