తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏమైనా  సంబంధం ఉందా ? 

తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం( Rajiv Gandhi Statue ) విషయమై ప్రధానంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

  తాజాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ కీలక నేత , మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagadeesh Reddy ) అనేక విమర్శలు చేశారు.

అసలు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ భవన్ లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా సెక్రటరీ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్లీ అధికారంలోకి వస్తే పెడదామని అనుకున్నామని , ఆ విషయం ముందే ప్రకటించామని అన్నారు.

  రాజీవ్ గాంధీకి తెలంగాణ పేరు తెలుసా అని జగదీష్ రెడ్డి విమర్శించారు.

"""/" / రాజీవ్ గాంధీ తెలంగాణకు ఒక్క రూపాయి మేలు చేశారా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

చిల్లర చేష్టలు తెలంగాణ ప్రజలు  కోరుకోవడం లేదని, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన చోట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కేసీఆర్( KCR ) సీఎంగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాగానే సెక్రటరీ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతామని జగదీశ్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శ చేశారు.రుణమాఫీపై కాంగ్రెస్( Congress ) పగటి దొంగలా దొరికిందని విమర్శించారు.

17 లక్షల పదమూడు వేల మందికి ఇంకా రుణమాఫీ జరగలేదని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారని,  రుణమాఫీ పడని రైతులకు ఏ తేదీ లోపు చేస్తారో చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

"""/" / సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రుణమాఫీ పూర్తి అయిందని డాన్సులు చేస్తున్నారని , మంత్రులు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదని అంటున్నారని , దీన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది వచ్చి అబద్ధమని ఉత్తంకుమార్ రెడ్డి మాటలతో తేలిపోయిందని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.

  అబద్ధం చెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

ముక్కు నేలకు రాసి చెంపలు వేసుకోవాలన్నారు.రుణమాఫీ కోసం రైతులు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని,  ఒక్కో మంత్రి ఒక్కోరకంగా చెబుతున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

వైరల్ వీడియో : సొంతవాహనాన్ని తగలపెట్టుకున్న వ్యక్తి..