సీనియర్ ఎన్టీఆర్ అనుకుంటే ప్రధాని అయ్యేవారు.. భారతరత్న ఎందుకు ఇవ్వలేదంటూ?
TeluguStop.com
సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) కు భారతరత్న( Bharat Ratna ) ఇవ్వాలనే డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి ఉందనే సంగతి తెలిసిందే.
ఎక్స్ ఐపీఎస్ నరసయ్య సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలలో నాకు నచ్చిన నిర్ణయాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని కామెంట్లు చేశారు.
పేదవాళ్లకు ఆహార భద్రతను గుర్తుంచుకుని రూ.2 కు కిలో బియ్యం స్కీమ్ ను సీనియర్ ఎన్టీఆర్ అమలులోకి తెచ్చారని నరసయ్య అన్నారు.
తక్కువ ధరకే జనతా వస్త్రాలను సీనియర్ ఎన్టీఆర్ అందించారని రైతుల కోసం ఆయన ఎన్నో పథకాలను తెచ్చారని నరసయ్య( Narasiah ) కామెంట్లు చేశారు.
పటేల్, పట్వారీ వ్యవస్థలను ఆయన రద్దు చేశారని మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు ఆస్తి హక్కులు ఇవ్వాలని ఆయన గొప్ప నిర్ణయం తీసుకున్నారని నరసయ్య అన్నారు.
రాయలసీమ గురించి సీనియర్ ఎన్టీఆర్ ఆలోచించి ఎన్నో నీటి ప్రాజెక్ట్ లను అమలు చేశారని నరసయ్య తెలిపారు.
"""/" /
సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు గొప్ప నిర్ణయాలు అని ఆయన చెప్పుకొచ్చారు.
గురుకుల పాఠశాలలలో ఎక్కువ పాఠశాలలను ఆయన ఏర్పాటు చేశారని నరసయ్య అన్నారు.ఎంసెట్ ను ప్రవేశపెట్టిందని ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది ఎన్టీఆర్ అని నరసయ్య అన్నారు.సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో మౌలికమైన మార్పులు తెచ్చి ఆద్యుడు అని తెలిపారు.
"""/" /
పరిపాలనా అనుభవం తక్కువగా ఉన్నా ఏదో మంచి చేయాలని ఎన్టీఆర్ భావించేవారని నరసయ్య పేర్కొన్నారు.
నేను హ్యూమనిస్ట్( Humanist ) అని ఆయన చెప్పేవారని ఆయన తెలిపారు.రాజకీయాల్లోకి వెళ్లకపోతే ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చేవని నరసయ్య చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని నరసయ్య పేర్కొన్నారు.సీనియర్ ఎన్టీఆర్ అనుకుంటే ప్రధాని అయ్యేవారని ఆయన కామెంట్లు చేశారు.
నరసయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
40 లోనూ నవ యవ్వనంగా కనిపించాలనుకుంటే ఈ రెమెడీని మిస్ అవ్వకండి!