కెనడాలో ఇమ్మిగ్రేషన్ స్కాం : ‘‘ అతనికి ఆ శిక్ష సరిపోదు ’’ .. కోర్టు తీర్పుపై భారతీయ విద్యార్ధుల స్పందన
TeluguStop.com
నకిలీ విద్యార్ధి వీసాలు, అడ్మిషన్ లెటర్స్ కుంభకోణానికి సంబంధించి భారత్‌లోని పంజాబ్‌కు చెందిన బ్రిజేష్ మిశ్రాను( Brijesh Mishra ) కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేరానికి సంబంధించి కెనడా అధికారులు అతనిపై మోపిన మూడు ఆరోపణల్లో దోషిగా తేలడంతో , బ్రిజేష్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
బుధవారం వాంకోవర్‌లోని బ్రిటీష్ కొలంబియా ప్రొవిన్షియల్ కోర్టు ఎదుట మిశ్రాను హాజరుపరిచారు.అయితే న్యాయస్థానం తీర్పుపై అతని కారణంగా బహిష్కరణ( Deportation ) ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న విద్యార్ధులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన బ్రిజేష్‌కు తేలికైన శిక్ష విధించడం తమను నిరాశకు గురిచేసిందని వారు చెబుతున్నారు.
అతని బాధితుల్లో ఒకడైన పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లాకు చెందిన రవీందర్ ప్రీత్ సింగ్ (28)( Ravinderpreet Singh ) గ్రేటర్ టొరంటో ఏరియా (జీటీఏ)లోని బ్రాంప్టన్ పట్టణంలో నివసిస్తున్నాడు.
"""/" /
భారతీయ విద్యార్ధులను( Indian Students ) దేశ బహిష్కరణ చర్యలకు వ్యతిరేకంగా గతేడాది నిరసనల్లో పాల్గొన్నాడు రవీందర్.
కోర్టు తీర్పుపై అతను స్పందిస్తూ.బ్రిజేష్‌కు శిక్ష పడినందుకు సంతోషంగానే ఉందని, కానీ అది అతనికి సరపోదన్నాడు.
తన జీవితంలోని కీలక సంవత్సరాలను బ్రిజేష్ వృథా చేశాడని అతని వల్ల ఆర్ధికంగా, మానసికంగా సమస్యలను ఎదుర్కొన్నానని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
"""/" /
విద్యార్ధుల తరపున వాదించిన టొరంటోకు చెందిన ఇమ్మిగ్రేషన్ న్యాయవాది సుమిత్ సేన్ మాట్లాడుతూ.
బ్రిజేష్ నేరానికి తొమ్మిదేళ్ల శిక్ష విధించాల్సిందని అభిప్రాయపడ్డాడు.బహుశా మిశ్రా వ్యక్తం చేసిన పశ్చాత్తాపాన్ని కోర్టు పరిగణలోనికి తీసుకుని ఉండొచ్చని సేన్ అన్నారు.
కాగా వీసా స్కాంకు( Visa Scam ) సంబంధించి అతనిపై మూడు కౌంట్ల అభియోగాలకు ఏకకాలంలో మూడేళ్ల శిక్ష విధించింది కోర్ట్.
దీని ప్రకారం గతేడాది జూన్‌లో అరెస్ట్ అయినప్పటి నుంచి లెక్కిస్తే అతనికి 19 నెలల శిక్షాకాలం మాత్రమే మిగిలి ఉంది.
దానికి ముందే బ్రిజేష్ పెరోల్‌కు అర్హత సాధించవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.కాగా.
గతేడాది ప్రారంభంలో నకిలీ వీసాలు , ఫేక్ ఆఫర్ లెటర్లతో అడ్మిషన్లు సంపాదించిన 700 మంది భారతీయ విద్యార్ధులను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారం ఇరు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది.భారత్, కెనడాలకు చెందిన రాజకీయ పార్టీలు విద్యార్థుల పక్షాన నిలబడ్డాయి.
ఈ ప్రయత్నాలు ఫలించి విద్యార్ధుల బహిష్కరణ ప్రక్రియను కెనడా ప్రభుత్వం నిలిపివేసింది.
ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!