నిహారికకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మాజీ భర్త.. ఏకంగా క్లోజ్ ఫ్రెండ్ తో అలా!

మెగా డాటర్ నిహారిక కొణిదెల( Niharika Konidela ) గురించి ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా మనందరికీ తెలిసిందే.

మొదట యాంకర్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారి పలు సినిమాలలో నటించినప్పటికీ తగిన గుర్తింపు దక్కకపోవడంతో పెళ్లి పీటలు ఎక్కేసింది.

జొన్నలగడ్డ చైతన్యను( Jonnalagadda Chaitanya ) పెళ్లి చేసుకుంది నిహారిక.కానీ ఎక్కువ రోజులు తన భర్తతో కలిసి ఉండలేకపోయింది.

ఊహించని విధంగా పెళ్లయిన కొన్ని ఏళ్ళకే భర్తతో విడాకులు తీసుకొని విడిపోయింది. """/" / దీంతో మెగా అభిమానులు కూడా నిహారిక పై భారీ స్థాయిలో మండిపడ్డారు.

ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు.విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది.

తనపై వస్తోన్న ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడు స్పందించలేదు.ఒక యూట్యూబ్‌లో ఛానెల్‌లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు.

పెళ్లైనా ఏడాదికే విడాకులు( Divorce ) తీసుకుంటానని ఊహించలేదు.దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది అని తెలిపింది.

పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని, నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది.

"""/" / ఇదిలా ఉంటే నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.అయితే వధువు మరెవరో కాదు నిహారిక క్లోజ్ ఫ్రెండే అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

నిహారిక ఫ్రెండ్ తోనే జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి జరగనుందనే ప్రచారం జరుగుతోంది.

ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ నంబర్‌కు ఫోన్ చేసి ఆశ్చర్యపోతున్న అమెరికన్లు.. ఎందుకో తెలుసా?