బిగ్ బాస్ 8 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మాజీ కంటెస్టెంట్లు… ఎవరంటే?
TeluguStop.com
బుల్లితెరపై అంత పెద్ద రియాలిటీ షోగా ప్రారంభమైన బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి తెలుగులో ఎంతో మంచి ఆదరణ ఉంది.
ఇక ఈ కార్యక్రమం ఇప్పటికే 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ఇటీవల ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే.
ఎనిమిదవ సీజన్లో భాగంగా 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు.
అయితే గత సీజన్లో మాదిరిగా ఐదవ వారం తరువాత వైల్డ్ కార్డు ఎంట్రీ( Wild Card Entry ) ద్వారా మరికొంతమంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది.
"""/" /
ఇలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే వారికి సంబంధించి ఎన్నో పేర్లు వినపడుతున్నాయి.
అయితే ఈ వైల్డ్ కార్డు ద్వారా ఈసారి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లను( Ex Contestants ) హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.
మరి మాజీ కంటెస్టెంట్లుగా హౌస్ లోకి అడుగుపెట్టే వారు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.
ఇక మాజీ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టేవారు సీజన్ సెవెన్ లో పాల్గొన్న వారు మాత్రమే కాకుండా గత సీజన్లలో పాల్గొన్న ఒక్కొక్కరిని హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.
"""/" /
ఇక గత సీజన్లో పాల్గొన్న సీరియల్ నటి శోభా శెట్టి ( Sobha Shetty ) పేరు ప్రస్తుతం బయటకు వచ్చింది.
ఈమెతో పాటు సీజన్ సిక్స్ లో పాల్గొన్న యాంకర్ రవి ( Anchor Ravi ) కూడా వైల్డ్ కార్డు ద్వారా సీజన్ 8 లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం.
ప్రస్తుతం వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక వీరితోపాటు రీతూ చౌదరి, బర్రెలక్క గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముకేష్ గౌడ్ కూడా ఈ కార్యక్రమంలోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
చీకటి పడితే ఆ కోరిక తీరాల్సిందే… మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి?