విభజన వల్ల ఏపీకి తీరని నష్టం జరిగింది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!!

ఏపీ బీజేపీ నేత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు.విభజన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రాజెక్టులు పూర్తి చేయటంపై దృష్టి పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నీటికీ ఇబ్బందులు వస్తాయని ఆనాడు విభజనను వ్యతిరేకించినట్లు అనంతపురం జిల్లాలో జరిగిన ఓ సభలో కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

కానీ రాష్ట్రంలో పరిపాలకులు బాగుంటే కష్టాలను కూడా అధిగమించవచ్చని అన్నారు.రాష్ట్ర విభజన జరిగి తొమ్మిది సంవత్సరాలు అయ్యింది.

"""/" /   ఉన్న రాష్ట్రాన్నికి రాజధాని ఏది అన్నదానికి సమాధానం లేకుండా పోయింది.

ఒకరేమో అమరావతిలో రాజధాని పెట్టారు.ఇప్పుడు వచ్చిన ఆయన మూడు రాజధానులు అని మారుస్తానని అంటున్నారు.

తొమ్మిది సంవత్సరాల తర్వాత రాజధాని విషయంలో గందరగోళం ఏర్పడింది.జిల్లాల విభజన కూడా సరిగ్గా జరగలేదని కిరణ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

నెల్లూరుకి తిరుపతికి అసలు సంబంధం ఏమిటి.నెల్లూరులో కొన్ని మండలాలు తీసుకెళ్లి తిరుపతిలో కలిపేసి దాన్ని ఒక జిల్లా చేయటం దారుణమని విమర్శించారు.

ఏ విధంగా అయితే విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందో.పాలకులు చేస్తున్న పిచ్చి పనుల వల్ల రాష్ట్రానికి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

మర్డర్ చేస్తానని అమెరికా అమ్మాయి వార్నింగ్.. వణికిపోయిన తనికెళ్ల భరణి.?