వృద్ధుడి శవం దగ్గర కొంగ చేసిన పని చూసి అంతా షాక్..

మూగ జీవాలకు మనుషుల కంటే ప్రేమ ఎక్కువ అని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.

తమకు సాయం చేసిన వారిని జీవితాంతం గుర్తుంచుకుంటాయని అంటారు.మనుషులైనా తమకు సాయం చేసిన వారిని మర్చిపోతారేమో కానీ మూగజీవాలు మాత్రం తమకు సాయం చేసిన వారిని అంత ఈజీగా మర్చిపోవు.

అందుకు తార్కాణంగా ప్రస్తుతం రాజస్థాన్ లో జరిగిన ఒక సంఘటన నిలుస్తోంది.రాజస్థాన్ రాష్ట్రంలో ని అల్వార్ జిల్లాలో ప్రస్తుతం జరిగిన ఘటన నిలుస్తోంది.

అక్కడి బగద్ పురా ముకద్ పురా అనే ఊర్లో మోతీలాల్ మీనా అనే వృద్ధుడు చనిపోయాడు.

ఆ వృద్ధుడి శవం వద్దకు ఒక కొంగ వచ్చి చేసిన పనికి అక్కడ ఉన్న వారంత షాక్ అయ్యారు.

మోతీలాల్ మీనా చనిపోవడంతో ఓ కొంగ అతడి శవం వద్దకు వచ్చింది.అతడి శవం చుట్టూ తిరుగుతూ ఉండిపోయింది.

అతడి శవాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్తుంటే కూడా ఆ కొంగ స్మశాన వాటికకు పోయింది.

బోరున విలపిస్తున్న మోతీలాల్ మీనా బంధువులను ఓదార్చే ప్రయత్నం చేసింది.స్మశానంలో మోతీలాల్ శవాన్ని కాలేసిన తర్వాత చితి మొత్తం కాలిపోయే వరకు ఆ కొంగ అక్కడే కాపలా ఉంది.

"""/" / ఇది చూసిన మోతీలాల్ మీనా బంధువులు, మరియు ఆ ఊరి గ్రామస్తులు నివ్వెరపోయారు.

వారి బంధువులు ఎందుకు కొంగ అలా చేసిందనే అసలు విషయం చెప్పారు.మోతీలాల్ మీనాకు వన్య ప్రాణులంటే ప్రాణమట.

అతడు వన్య ప్రాణులకు ప్రతి రోజూ ఆహారం పెట్టేవాడని, అందుకోసమే ఆ కొంగ అలా వచ్చి మోతీలాల్ మీనా శవం వద్ద ఉండి పోయిందని తెలిపారు.

ఏదేమైనా మోతీలాల్ మీనాది చాలా గ్రేట్ కదా.ఆహారం పెట్టిన వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న కొంగ చేసిన పనిని చూసి కూడా అక్కడి వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్