భద్రాద్రి రామయ్య కల్యాణానికి సర్వం సిద్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామాలయంలో స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధమైంది.

రేపు నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి దివ్యక్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబైంది.ఈ మేరకు మిథిలా స్టేడియంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

లక్ష మందికి పైగా భక్తులు వస్తారని భావిస్తున్న అధికారులు రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

ఎల్లుండి పుష్కర పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.మరోవైపు రామయ్య కల్యాణానికి ముత్యాల తలంబ్రాలతో పాటు భక్తుల కోసం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు.